ఐబొమ్మ (iBomma) రవి ని అరెస్ట్ చేసినప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హడావిడి జరిగింది కానీ, పైరసీ మాత్రం ఆగలేదు. నిజానికి పైరసీ అనేది కేవలం చూసే జనాలు మారితే పోయేది కాదు, అది టెక్నికల్ సమస్య. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి పెద్ద పెద్ద ఓటీటీ (OTT) సంస్థలు తమ సినిమాలకు సరైన సెక్యూరిటీ ఇవ్వకపోవడమే దీనికి మెయిన్ రీజన్. వేల కోట్లు పెట్టి సినిమాలు కొంటారు కానీ, అవి లీక్ అవ్వకుండా ఉండడానికి గట్టి టెక్నాలజీని వాడట్లేదు. వెబ్‌సైట్లలో ఈజీగా సినిమా రికార్డ్ చేసే ఆప్షన్ ఉండటం వల్లే, రిలీజ్ అయిన గంటల్లోనే పైరసీ సైట్లలో కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి.
Also Read : Shivaji Comments : అనసూయ, చిన్మయిలకు గట్టి కౌంటర్ ఇస్తూ.. శివాజీ కి మద్దతుగా నిలిచిన కరాటే కల్యాణి ..
అయితే, పైరసీని ఆపడం సాధ్యమేనని మన ‘ఈటీవీ విన్’ (ETV Win) ప్రూవ్ చేసింది. వాళ్లు తమ యాప్‌లో కొత్త సినిమాలు వచ్చినప్పుడు బ్రౌజర్‌లో చూడటానికి పర్మిషన్ ఇవ్వకుండా, కేవలం మొబైల్ యాప్ లేదా స్మార్ట్ టీవీలో మాత్రమే చూసేలా లాక్ చేశారు. దీనివల్ల ‘క’, ‘అనగనగా’ లాంటి సినిమాలు వెంటనే పైరసీ అవ్వలేదు. పెద్ద ఓటీటీ సంస్థలు కూడా ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పైరసీని ఈజీగా అడ్డుకోవచ్చు. కేవలం ప్రేక్షకుల మీద నింద వేయడం మానేసి, ఓటీటీ సంస్థలే తమ భద్రతను పెంచుకోవాల్సిన టైమ్ వచ్చిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.