The Kerala Story: సంచలనాలకు కేంద్రబిందువుగా మారిని ‘‘ ది కేరళ స్టోరీ ’’ సినిమాపై స్టే ఇచ్చేందుకు కేరళ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ సినిమా సెన్సార్ షిప్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ ను ఈ రోజు విచారించింది. ఇప్పటికే ఈ సినిమాపై సుప్రీంకోర్టు కూడా స్టేకు నిరాకరించింది.
Apple Record Revenue: భారతదేశంలో ఆపిల్ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా త్రైమాసిక ఫలితాలను సాధించిందని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ ఆనందం వ్యక్తం చేశారు. భారతదేశం అద్భుతమైన మార్కెట్ అంటూ కొనియాడారు. ఐఫోన్ తయారీ సంస్థ అయిన ఆపిల్ ఇటీవలే భారతదేశంలో రెండు రిటైల్ స్టోర్లను ఏర్పాటు చేసింది. ఏడేళ్ల తర్వాత ఇటీవల టిమ్ కుక్ భారతదేశ పర్యటకు వచ్చారు. ముంబై, ఢిల్లీ నగరా్లలో రిటైల్ మార్కెట్ ను ప్రారంభించారు. రెండంకెల వృద్ధితో ఏటికేడు బలంగా వృద్ధి…
Elephants Attack: జార్ఖండ్ రాష్ట్రంలో ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి. లతేహార్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని తొక్కి చంపేశాయి. చనిపోయిన బాధితుల్లో మూడేళ్ల చిన్నారి కూడా ఉండటం విషాదాన్ని నింపింది. శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో మల్హాన్ పంచాయతీ వద్ద ఇటుక బట్టీ యూనిట్ సమీపంలోని తాత్కాలిక గుడిసెలో 30 ఏళ్ల కూలీ ఫను భుయిన్యాన్ తన 26 ఏళ్ల భార్య బబితా దేవి, మూడేళ్ల కుమార్తెతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
Earthquake: జపాన్ దేశం మరోసారి భూకంపానికి వణికింది. జపాన్లోని సెంట్రల్ ఇషికావా ప్రాంతంలో శుక్రవారం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. జపాన్ స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 2.42 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. సునామీపై ఎలాంటి హెచ్చరికలు చేయలేదు. భూకంపం ధాటికి నగానో మరియు కనజావా మధ్య షింకన్సేన్ బుల్లెట్ రైళ్లను నిలిపేశారు. సుజీ సిటీలో కొండచరియలు విరిగిపడ్డాయి.
Sharad Pawar: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ రాజీనామా చేయడం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ రోజు ఎన్సీపీ కోర్ కమిటీ ముంబైలో భేటీ అయింది. అయితే శరద్ పవారే ఎన్సీపీ అధినేతగా కొనసాగాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
S Jaishankar: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) సమావేశాల్లో భాగంగా ఈ రోజు గోవా వేదికగా ఎస్సిఓ కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ మినిస్టర్స్ (సిఎఫ్ఎం) జరిగింది. ఈ సమావేశానికి సభ్యదేశాలు అయిన పాకిస్తాన్, చైనా, రష్యా, తజకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ దేశాల విదేశాంగమంత్రలు హాజరయ్యారు. పాకిస్తాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కూడా సమావేశాలకు హాజరయ్యారు. బిలావల్ ను స్వాగతించిన కొద్ది సేపటికే భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉగ్రవాదంపై స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు.
DK Shivakumar: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరికి ఆసక్తి కర్ణాటక ఎన్నికలపై నెలకొన్నాయి. కాంగ్రెస్ పతనావస్థకు అడ్డుకట్ట పడాలంటే.. కర్ణాటకలో ఖచ్చితంగా గెలిచితీరాలి. ఇక 2024లో మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే బీజేపీకి కర్ణాటక ఎన్నికలు చాలా కీలకం. మోదీ మానియా ఇంకా తిరుగులేదని బీజేపీ భావిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. నిన్న మొన్నటి వరకు కర్ణాటక ఎన్నికలంతా అభివృద్ధి వైపు సాగితే.. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ‘భజరంగబలి’ జపం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయం అంతా హనుమాన్ చుట్టూ తిరుగుతోంది.
Online News: భారతదేశంలో రోజురోజుకు ఇంటర్నెట్ యూజర్స్ పెరుగుతున్నారు. దీంతో పాటే ఆన్లైన్ వార్తలకు ఎక్కువ మంది యూజర్స్ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. దాదాపుగా సగానికి కన్నా ఎక్కువ మంది ఇంటర్నెట్ యూజర్లు ఆన్లైన్ లో వార్తల్ని చూస్తున్నట్లు కాంటార్-గూగూల్ నివేదికలో వెల్లడైంది. పట్టణ ప్రాంతాల్లో 37 శాతం ఇంటర్నెట్ యూజర్లతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని 63 శాతం మంది వార్తల కోసం ఆన్లైన్ వినియోగిస్తున్నట్లు నివేదిక తెలిపింది. వివిధ భారతీయ భాషల్లోని 52 శాతం అంటే 37.9 కోట్ల మంది…
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నాయి భద్రతా బలగాలు. వరసగా మూడో రోజు కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. రాజౌరీ జిల్లాలో శుక్రవారం ఉదయం ఎన్కౌంటర్ ప్రారంభమైంది. ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు అందిన సమచారం ప్రకారం భద్రతా సిబ్బంది గాయపడినట్లు తెలుస్తోంది.
Viral Video: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. ఈ యుద్ధం వల్ల రెండు దేశాలు బద్ధశతృవులుగా మారాయి. ఈ శతృత్వం ప్రజలు, రాజకీయ నాయకుల్లో కూడా పేరుకుపోయింది. ఇందుకు ఓ వీడియో ప్రస్తుతం సాక్ష్యంగా నిలుస్తోంది. ఓ గ్లోబల్ సమావేశంలో రష్యా ప్రతినిధిని ఉక్రెయిన్ ఎంపీ కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. టర్కీ రాజధాని అంకారాలో గురువారం బ్లాక్ సీ ఎకనామిక్ కమ్యూనిటీ 61వ పార్లమెంటరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది.