Meta Layoffs: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, ఆర్థికమాంద్యం భయాలు టెక్ కంపెనీలను వణికిస్తున్నాయి. ఇప్పటికే మెటా, అమెజాన్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు వేలల్లో ఉద్యోగులను తొలగించాయి. ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మెటా తన ఆర్థిక పనితీరును మెరుగుపరుచుకోవడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో 2023ని ‘‘ఇయర్ ఆఫ్ ఎఫిషియెన్సీ’’గా ప్రకటించింది.
Read Also: Mancherial : మంచిర్యాలలో మహిళ దారుణ హత్య
ఇదిలా ఉంటే తాజాగా ఫేక్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా మరోసారి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మరో రౌండ్ ఉద్యోగులకు తొలగింపుకు మెటా సిద్దం అయింది. రెండు నెలల క్రితం 10,000 మందిని తీసేసిన మెటా.. వచ్చే వారం మూడోసారి లేఆఫ్స్ ఉండబోతున్నాయని గురువారం ఉద్యోగులతో జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే వచ్చే వారం ఎంత మందిని తొలగిస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. ఈ తొలగింపు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఏ ఉద్యోగులపై ప్రభావం ఉంటుందనే వివరాలను ఉద్యోగులను తొలగించే మందు రోజు మధ్యాహ్నం తెలుపుతామని మెటా తెలిపింది.
ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మార్చి నెలలో రెండో విడత ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. మార్చి నెలలో 10,000 ఉద్యోగులను తొలగిస్తామని వెల్లడించింది. అంతకుముందు గతేడాది నవంబర్ నెలలో 13 శాతం ఉద్యోగులను అంటే 11,000 మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. 2022 చివరి నాటికి మెటాలో ప్రపంచవ్యాప్తంగా 86,482 మంది పనిచేస్తున్నారు. తాజాగా వచ్చే వారం మూడో సారి ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ప్రకటించి ఉద్యోగుల గుండెల్లో బాంబులు పేల్చింది.