Rs. 2000 Notes withdrawn: రూ. 2000 నోట్లను ఉపసంహరించుకన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.2,000 నోట్లను సర్క్యులేషన్ లో ఉంచొద్దని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవాలని, మే 23 నుంచి ఆర్బీఐ రీజినల్ ఆఫీసుల్లో రూ. 2000 నోట్లను మార్చుకోవచ్చని ప్రకటించింది. ఆర్బీఐ చెప్పిన గడువు వరకు రూ. 2000 డినామినేషన్ చట్టబద్ధంగా చెల్లుబాటులో కొనసాగుతున్నప్పటికీ.. తక్షణం ఇప్పటి నుంచే అమలులోకి వచ్చేలా రూ.2000 డినామినేషన్ నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. దేశంలోని అన్ని బ్యాంకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ.2 వేల నోటు మార్పిడి చేసుకోవచ్చు. క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ. 2 వేల నోటు ఉపసంహరణ. ఒక్కొక్కరు ఒక్కో విడతలో 10 రూ. 2 వేల నోట్లను మార్చుకునే అవకాశం.
శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, సెంట్రల్ బ్యాంక్ ఇలా పేర్కొంది: “రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క “క్లీన్ నోట్ పాలసీ” ప్రకారం, ₹2000 డినామినేషన్ నోట్లను చెలామణి నుండి ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ఈ విత్ డ్రాను సమాయానుకూలంగా పూర్తి చేసేందుకు ప్రజలకు తగిన సమయం అందించడానికి సెప్టెంబర్ 30, 2023 వరకు గడవు ఇచ్చినట్లు పేర్కొంది.
ప్రస్తుతం రూ. 2000 డినామినేషన్ నోట్లలో దాదాపుగా 89 శాతం మార్చి 2017కు ముందు జారీ చేయబడ్డవే అని.. మార్చి 31, 2018 నాటికి చెలామణిలో గరిష్టంగా ఉన్న 37.3 శాతం అంటే రూ. 6.73 లక్షల కోట్ల నోట్ల విలువ నుంచి రూ. 3.62 లక్షల కోట్లకు తగ్గిందని.. మార్చి 31, 2023న చెలామణిలో ఉన్న నోట్లలో కేవలం 10.8 శాతం మాత్రమే రూ. 2000 నోట్లు ఉన్నాయని తెలిపింది.
ఏ బ్యాంకులోనైనా ఒకే సారి అంటే పది రూ. 2000 నోట్లు అంటే రూ. 20,000 మాత్రమే మార్చుకోవచ్చనే పరిమితి విధించింది. నవంబర్ 2016లో పాత నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసి కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టారు. 2018-19లో రూ. 2,000 నోట్ల ముద్రణను ఆపేశారు.
Reserve Bank of India has advised banks to stop issuing Rs 2000 denomination banknotes with immediate effect though banknotes in Rs 2000 denomination will continue to be legal tender. https://t.co/yLWWpyuahL pic.twitter.com/kPTMqlm1XD
— ANI (@ANI) May 19, 2023