Marriage Cancellation: ఇటీవల కాలంలో పెళ్లి పందిరిలోనే పెళ్లిళ్లు పెటాకులు అవుతున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిల ప్రవర్తన ఇందుకు కారణం అవుతోంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పెళ్లి వేడుకలో వరుడికి షాక్ ఇచ్చింది పెళ్లికూతురు. వివాహ సమయానికి తాగి వచ్చిన వరుడితో పెళ్లికి నో చెప్పింది.
Bengaluru Rains: బెంగళూర్ నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరాయి. అండర్ పాస్ లు అన్ని నీట మునిగాయి. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. ఇదిలా ఉంటే బెంగళూర్ వర్షానికి ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లాకు చెందిన భానురేఖ(22) అనే యువతి మరణించింది.
Microsoft: ఆర్థిక మాంద్యం భయాలు, ఆర్థిక మందగమనం టెక్ కంపెనీలను భయపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు ఉద్యోగులను తీసేశాయి. మరికొన్ని సంస్థలు మాత్రం ఈ ఏడాది ఉద్యోగులకు జీతాలు పెంచే పరిస్థితి లేదని చెబుతున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా తమ ఉద్యోగులకు ఈ ఏడాది సాలరీ హైక్ ఉండదని చెప్పింది. దీనిపై ఆ సంస్థ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Dinesh Gope: ఎన్నో ఏళ్లుగా పోలీసులును, భద్రతా సంస్థల్ని ముప్పుతిప్పలు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ దినేష్ గోపే పట్టుబడ్డాడు. ఇండియా నుంచి పారిపోయి నేపాల్ లో ఉంటున్న గోపేను జార్ఖండ్ పోలీసులు, జాతీయ భద్రత ఏజెన్సీ(ఎన్ఐఏ) జాయింట్ ఆపరేషన్ లో పట్టుబడ్డాడు. అతని తలపై రూ.30 లక్షల రివార్డ్ ఉంది. ఆదివారం నిషేధిత తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎల్ఎఫ్ఐ) అధినేత దినేష్ గోప్ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని నేపాల్ నుంచి ఢిల్లీ తీసుకువస్తున్నారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ జాపాన్ లో జీ-20 సమావేశం ముగిసిన తర్వాత ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపిఐసి) కోసం ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్నారు.
Uttarakhand: ఓ వ్యక్తి ఉత్తరాఖండ్ కి చెందిన హిందూ యువతిని మోసం చేశాడు. మహ్మద్ ఇఖ్లాష్ అనే వ్యక్తి మనోజ్ గా తన పేరు మార్చుకుని ఓ హిందూ యువతితో పరిచయం పెంచుకుని, ప్రేమిస్తున్నట్లు నటిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటి ఆగకుండా అభ్యంతరకర వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. ప్రస్తుతం యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మహ్మాద్ ఇఖ్లాష్ మనోజ్ గా నటిస్తూ, గురుగ్రామ్ లోని జీడీ గోయెంకా యూనివర్సిటీలో చదువుతున్నట్లు యువతిని నమ్మించాడు.
Bengaluru Rains: కర్ణాటక రాజధాని బెంగళూర్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు రోడ్లపైకి నీరు చేరింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం ప్రభావం కారణంగా బెంగళూర్
Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు తన కుమార్తె వివాహాన్ని ముస్లిం వ్యక్తితో కుదిర్చాడు. ఇరువురు ఇష్టపడటంతో ఇరు కుటుంబాలు ఒప్పుకోవడం పెళ్లికి సిద్ధపడ్డాడు. ఇదిలా ఉంటే పెళ్లికి సంబంధించిన పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పెళ్లిపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో చివరకు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. మే 28న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఈ విషయంలో హిందూ సంస్థల ఒత్తడి కూడా ఉంది. తన కుమార్తె ముస్లిం వ్యక్తిని పెళ్లి…
Mehbooba Mufti: జీ 20 దేశానికి సంబంధించిన కార్యక్రమం అని.. కానీ బీజేపీ దాన్ని హైజాక్ చేసిందని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ బెంగళూర్ లో ఆరోపించారు. జీ 20ని వ్యతిరేకించడం లేదని, కానీ బీజేపీ హైజాక్ చేసిందని అన్నారు. చివరకు జీ 20 లోగోను కూడా కమలంగా మార్చిందని ఆమె విమర్శించారు. లోగో దేశానికి చెందినదిగా ఉండాలని, పార్టీకి సంబంధించిన విధంగా ఉండకూడదని ఆమె అన్నారు.
G20: జమ్మూ కాశ్మీర్ లో జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్(టీడబ్ల్యూజీ) సమావేశం మే 23,24,25 తేదీల్లో జరగనుంది. శ్రీనగర్ లో ఈ సమావేశం జరుగబోతోంది. అయితే ప్రస్తుతం ఇదే పాకిస్తాన్ కడుపు మంటకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ గూఢాచర సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), ఉగ్రవాదులతో కలిసి కుట్ర పన్నుతోంది.