G20: జమ్మూ కాశ్మీర్ లో జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్(టీడబ్ల్యూజీ) సమావేశం మే 22,23,24 తేదీల్లో జరగనుంది. శ్రీనగర్ లో ఈ సమావేశం జరుగబోతోంది. అయితే ప్రస్తుతం ఇదే పాకిస్తాన్ కడుపు మంటకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలను భగ్నం చేసేందుకు పాకిస్తాన్ గూఢాచర సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), ఉగ్రవాదులతో కలిసి కుట్ర పన్నుతోంది. ఈ నేపథ్యంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జీ-20 సమావేశాల వేళ గుల్‌మార్గ్‌లో 26/11 ముంబై దాడుల్లాగా మరో దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఐఎస్ఐ ఆదేశాల మేరకు ఈ ప్లాన్ చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.
దీంతో సమావేశ భద్రత కారణాల దృష్ట్యా చివరి నిమిషంలో మార్పులు చేశారు. ఓ హోటల్ లో పనిచేస్తున్న ఉగ్రవాదుల కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఓ వ్యక్తిని భద్రతాబలగాలకు చిక్కాడు. అతను ఇచ్చిన సమాచారంతో ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లో మార్పులు చేశారు. కాశ్మీర్‌లో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా ఏకకాలంలో రెండు మూడు చోట్ల దాడులు చేసేందుకు ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారని ఓజీడబ్ల్యూ వర్గాలు తెలిపాయి.
Read Also: Rishi Sunak: చైనా ప్రపంచ భద్రతకు సవాల్‌గా మారింది..
దీంతో జీ 20 వేదిక చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో కాశ్మీర్ లోయ ప్రాంతంలో ఎలాంటి పుకార్లు చెలరేగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ కాల్స్ పై దృష్టిపెట్టారు అధికారులు. మరోవైపు శ్రీనగర్ దాల్ లేక్ పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి బలగాలు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ), పారా మిలిటరీ, సైన్యం, పోలీసులు కాశ్మీర్ అంతటా సెక్యురిటీని కట్టుదిట్టం చేశారు. కాశ్మీర్ అంతటా, ముఖ్యంగా శ్రీనగర్‌లోని అన్ని కదలికలను సిసిటివి మరియు డ్రోన్‌ల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే ఉగ్రవాదుల కోసం క్షేత్రస్థాయిలో సహాయసహకారాలు అందించే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్(ఓజీడబ్ల్యూ) ఉగ్రవాదులకు లాజిస్టికల్ మద్దతు, నగదు, ఆశ్రయం ఇతర సహాయసహకారాలను అందిస్తుంటారు. వీరు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహీదీన్, లష్కరేతోయిబా వంటి ఉగ్రసంస్థలకు సహాయం అందిస్తున్నారు. తాజాగా పట్టుబడిన వ్యక్తి బారాముల్లాలోని హైగమ్ సోపోర్ కు చెందిన ఫరూక్ అహ్మద్ వనీగా గుర్తించారు. ఇతను గుల్‌మార్గ్‌లోని ఓ ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఫైవ్ స్టార్ హోటల్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఐఎస్ఐ అధికారులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు తేలింది. ముంబైలో తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రదాడి లాగే విదేశీ ప్రముఖులు ఉన్న హెటళ్లను లక్ష్యంగా చేసుకునేందుకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది.