Car theft: ఓ కారు దొంగతనం ముగ్గురు యువకులను తీవ్ర ఇబ్బందులు పెట్టింది. డబ్బులు సంపాదించాలనుకున్న ముగ్గురు యువకులు కారును దొంగిలించి, చివరకు పట్టుబడ్డారు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. కారునైతే దొంగిలించారు కానీ.. ఆ ముగ్గురిలో ఒక్కరికి కూడా కార్ డ్రైవింగ్ రాదు. సక్సెస్ ఫుల్ గా దొంగతనం చేశారు కానీ.. తమకు డ్రైవింగ్ రాదన్న విషయాన్ని మరిచిపోయారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు.
Asaduddin Owaisi: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. మే 28న ప్రధాని నరేంద్రమోడీ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అయితే ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి
Most Miserable Country: ప్రపంచంలోనే అత్యంత దుర్భరమైన దేశంగా ఆఫ్రికా దేశం జింబాబ్వే తొలి స్థానంలో నిలిచింది. ప్రఖ్యాత ఆర్థికవేత్త స్టీవ్ హాంకే వార్షిక మిజరీ ఇండెక్స్ (HAMI) ప్రకారం జింబాబ్వే ఈ తొలిస్థానంలో నిలిచింది.
Canada: కెనడాకు చెందిన ఓ మహిళ అత్యంత అరుదైన జబ్బుతో బాధపడుతోంది. ఏదైనా వ్యాయామం చేస్తే ఒళ్లంతా తీవ్రమైన అలర్జీతో బాధపడుతుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఫ్లైట్ ఎక్కేందుకు సమయం అయిపోతుండటంతో ఎయిర్ పోర్టులో పరిగెత్తి ప్రాణాలు మీదకు తెచ్చుకుంది.
Viral Video: కొన్నిసార్లు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు కొట్టుకోవడం చూశాం. ఇండియాలో ఇటువంటి సంఘటనలు చాలా వరకు జరిగాయి. అయితే ఎయిర్ పోర్టులో ప్రయాణికులు ఒకరినొకరు తన్నుకోవడం చాలా వరకు అరుదు. అదికూడా అమెరికా లాంది దేశాల్లో. సెక్యూరిటీ పెద్ద ఎత్తున ఉంటుంది.
Rahul Gandhi: నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం వివాదాస్పదంగా మారుతోంది. మే 28న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ కార్యక్రమాన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి హాజరుకామని 19 ప్రతిపక్ష పార్టీలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్య రాష్ట్రపతిని అవమానించడమే అని అన్నారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. మధురలో 75 ఏళ్ల పూజారిని గుర్తు తెలియన దుండగులు కొట్టి చంపారు. కాళ్లు, చేతులు కట్టేసి కొట్టి చంపారు. చనిపోయిన వ్యక్తిని హరిదాస్ మహారాజ్ గా గుర్తించారు. కాళ్లు, చేతులను వెనక్కి కట్టేసి, తలపై ఇటుకతో మోది హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Electric two-wheelers: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల ధరలు మరింత పెరగే అవకాశం ఉంది. జూన్ 1, 2023 వరకు FAME II ద్వారా ప్రభుత్వ ఇస్తున్న రాయితీల్లో కోత విధించనుంది. 2019లో కేంద్ర ప్రభుత్వం విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు FAME లేదా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ హైబ్రిడ్స్ పథకాన్ని తీసుకువచ్చింది. దీంట్లో భాగంగా వాహనం మొత్తం విలువలో 40 శాతం వరకు కేంద్రం ప్రోత్సహాకాలను ఇస్తోంది. ఇకపై ఆ పరిమితిని వాహానాల ఎక్స్ ఫ్యాక్టరీ ధరలో 15…
Tata Altroz iCNG: ఇండియాలో సీఎన్జీ వాహనాల మోడల్స్ విడుదల అవుతున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకీ దీంట్లో ముందుంది. ఇప్పుడు దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే టాటా లో టియాగో, టిగోర్ సీఎన్జీ వెర్షన్ కార్లు ఉండగా.. ప్రస్తుతం మరో హ్యచ్ బ్యాక్ కారు టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీని తీసుకువస్తోంది. దీనికి సంబంధించిన ధరలను కూడా వెల్లడించింది. భారతదేశంలో ట్విన్-సిలిండర్ CNG సిస్టమ్‌ను కలిగి ఉన్న మొదటి […]
James Webb Telescope: ఈ విశాల విశ్వం మన ఊహకు కూడా అందదు. విశ్వంలోని గెలాక్సీలు, బ్లాక్ హోల్స్, నక్షత్రాలతో పోలిస్తే భూమి ఇసుక రేణువు కన్నా తక్కువే. అయితే ఎప్పటికప్పుడు విశ్వ రహస్యాలను తెలుసుకోవాలను మానవుడి ఆశ అనేక ప్రయోగాలకు కారణం అవుతోంది. మనం ఉన్న గెలాక్సీ ‘‘ మిల్కీ వే’’ గురించే మనం ఇప్పటి వరకు పూర్తిగా తెలుసుకోలేకపోయాం. అలాంటిది ఈ విశ్వంలో కొన్ని కోటాను కోట్ల గెలాక్సీలు, అందులో లక్షల కోట్ల సంఖ్యలో నక్షత్రాల ఇలా మన ఊహకు కూడా…