Uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు తన కుమార్తె వివాహాన్ని ముస్లిం వ్యక్తితో కుదిర్చాడు. ఇరువురు ఇష్టపడటంతో ఇరు కుటుంబాలు ఒప్పుకోవడం పెళ్లికి సిద్ధపడ్డాడు. ఇదిలా ఉంటే పెళ్లికి సంబంధించిన పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పెళ్లిపై నెటిజన్ల నుంచి తీవ్ర అభ్యంతరాలు రావడంతో చివరకు పెళ్లిని రద్దు చేసుకున్నాడు. మే 28న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే ఈ విషయంలో హిందూ సంస్థల ఒత్తడి కూడా ఉంది. తన కుమార్తె ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందన్న విమర్శల నేపథ్యంలో పౌరీ మున్సిపల్ చైర్మన్ యశ్ పాల్ బెన్ తన కుమార్తె పెళ్లిని వాయిదా వేశారు.
Read Also: Mehbooba Mufti: జీ 20ని బీజేపీ హైజాక్ చేసింది.. ఆర్టికల్ 370 తెచ్చేవరకు పోటీ చేయను..
బీజేపీ నేత కుమార్తె పెళ్లికార్డు పోటో గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ నేత కుమార్తె ఓ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మద్దతుదారులతో పాటు ఇతరులు యశ్ పాల్ బెనమ్ పై తీవ్ర విమర్శలు చేశారు. తన కూతురు సంతోషం కోసం పెళ్లి నిర్ణయించానని, సోషల్ మీడియాలో వ్యతిరేకత రావడంతో వాయిదా వేస్తునట్లు తెలిపారు. నేను ప్రజల మాట కూడా వినాలి కదా.. అని ఆయన అన్నారు. హిందుత్వ సంఘాలు శుక్రవారం పౌరీలోని ఝుండా చౌక్ లో బీజేపీ నేత యశ్ పాల్ కు వ్యతిరేకంగా దిష్టిబొమ్మ దహనం చేశారు. వీహెచ్పీ, భైరవసేన, భజరంగ్ దళ్ ఈ నిరసనల్లో పాల్గొన్నాయి. ఇలాంటి వివాహాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వీహెచ్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ దీపక్ గౌడ్ అన్నారు.
ఇరు కుటుంబాల అనుమతితో పెళ్లి రద్దు చేసుకున్నారు. ప్రజాప్రతినిధి అయినందున, నా కుమార్తె వివాహం పోలీసులు రక్షణలో జరగాలని కోరుకోననని, నేను ప్రజల మనోభావాలను గౌరవిస్తానని యశ్ పాల్ బెనమ్ అన్నారు. అయితే ముస్లిం వ్యక్తితో తన కుమార్తె వివాహం విషయంలో కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, వరుడి తరుపు వారితో కలిసి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.