Uttarakhand: ఓ వ్యక్తి ఉత్తరాఖండ్ కి చెందిన హిందూ యువతిని మోసం చేశాడు. మహ్మద్ ఇఖ్లాష్ అనే వ్యక్తి మనోజ్ గా తన పేరు మార్చుకుని ఓ హిందూ యువతితో పరిచయం పెంచుకుని, ప్రేమిస్తున్నట్లు నటిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటి ఆగకుండా అభ్యంతరకర వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. ప్రస్తుతం యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మహ్మాద్ ఇఖ్లాష్ మనోజ్ గా నటిస్తూ, గురుగ్రామ్ లోని జీడీ గోయెంకా యూనివర్సిటీలో చదువుతున్నట్లు యువతిని నమ్మించాడు.
యువతి ఫిర్యాదు మేరకు మే 18న కొత్వాలీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వివారాల్లోకి వెళ్తే హిందూ మహిళను ట్రాప్ చేసేందుకు సదరు నిందితుడు మనోజ్ గా పేరు మార్చుకున్నాడు. నెమ్మనెమ్మడిగా యువతితో మాట్లాడుతూ.. ప్రేమిస్తున్నట్లు నటించాడు. యువతి స్వస్థలం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. ఆమెను కలిసేందుకు ఇఖ్లాస్ పలుమార్లు డెహ్రాడూన్ వెళ్లాడు. చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు యువతిని లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. చాలా సార్లు తనకు డబ్బు అవసరం ఉందని చెబుతూ.. యువతి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు. తనకు అనారోగ్యంగా ఉందని మరిన్ని డబ్బులు కావాలని ఆమెతో చెప్పేవాడు.
Read Also: Bengaluru Rains: బెంగళూర్‌లో భారీ వర్షం.. ఏపీకి చెందిన ఒకరు మృతి..
అయితే బాధితురాలికి అనుమానం రావడంతో నిజాలను తెలుసుకునేందుకు అతడు ఉండే ప్రాంతానికి వెళ్లింది. బాధితురాలని ఇఖ్లాష్ ఓ హోటల్ లోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఇఖ్లాష్ అనే పేరుతో ఉన్న ఐడీ కార్డును యువతికి చూపించాడు. దీని తర్వాత బాధితురాలు డెహ్రాడూన్ తిరిగి వచ్చింది. ఆ తరువాత నుంచి నిందితుడు యువతికి సంబంధించిన లైంగిక వీడియోలు తన వద్ద ఉన్నాయని చెబుతూ.. బ్లాక్ మెయిల్ చేయసాగాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, డబ్బులు ఇవ్వాలంటూ వేధించసాగాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన వద్ద నుంచి రూ. 5 లక్షలు తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది.
నిందితుడిపై సెక్షన్ 376, 419 కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 19న ఇఖ్లాష్ ను పోలీసులు అరెస్ట్ చేసేందుకు హర్యానాలోని పల్వాల్ కు వెళ్లారు. అక్కడ అతడిని అరెస్ట్ చేశారు. శనివారం కోర్టులో హాజరుపరిచి కస్టడీకి తరలించారు. ఈ కేసులో విచారణ జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.