Sharad Pawar: విపక్షాల ఐక్యత కోసం దేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్, ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే ప్రశ్న వస్తోంది. తాజాగా దీనిపై స్పందించారు శరద్ పవార్. తాను ప్రధాన మంత్రి రేసులో లేనని ప్రకటించారు.
The Kerala Story: ఒక యువకుడితో రిలేషన్ లో ఉన్న మహిళ ‘‘ ది కేరళ స్టోరీ’’ చూసిన తర్వాత అతడిపై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు 23 ఏళ్ల యువకుడిని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Bengaluru: బెంగళూర్ లో అధికారం వర్షం బీభత్సాన్ని సృష్టించింది. నగరం మొత్తం భారీ వర్షం తడిసిముద్దైంది. పలు ప్రాంతాల్లో అండర్ పాసుల కిందికి నీళ్లు చేరాయి. రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జాం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే ఈ వర్షం వల్ల ఆంధ్రప్రదేశ్ కు చెంది టెకీ భానురేఖ మరణించారు.
Zomato: రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ). అయితే అప్పటి నుంచి జనాలు ఉన్న రూ.2000 నోట్లతో కొనుగోళ్లను ప్రారంభించారు. షాపింగ్ మాల్స్, హోటళ్లలోకి ఈ నోటుతో కొనుగోలు చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే రూ.2000 నోటును ఉపసంహరిస్తున్నామని ఆర్బీఐ ప్రకటించిందో.. అప్పటి నుంచి జొమాటోలో క్యాష్ ఆన్ డెలివరీ(సీఓడీ)ఆర్డర్లలో కస్టమర్లు ఈ నోటును ఇస్తున్నట్లు వెల్లడించింది.
Giriraj Singh: ప్రముఖ ముస్లిం నేత మౌలానా అర్షద్ మదానీ ‘భజరంగ్ దళ్’ని కర్ణాటకలో నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై బీజేపీ నేత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు. కర్ణాటక ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మానిఫెస్టోలో భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. పీఎఫ్ఐతో పాటు భజరంగ్ దళ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హమీని మదానీ సమర్థించారు. ఇది 70 ఏళ్ల క్రితమే తీసుకోవాల్సిన చర్యగా అభిప్రాయపడ్డారు.
Salman Khan: జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టాప్-10 హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. బిష్ణోయ్ గత కొంత కాలంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడు.
Amit Shah: జనన, మరణాలకు సంబంధించిన వివరాలను ఓటర్ల జాబితాతో పాటు మొత్తం అభివృద్ధి ప్రక్రియకు అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బిల్లును తీసుకురానున్నట్లు యోచిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం తెలిపారు. భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమీషనర్ కార్యాలయం ‘జనగణన భవన్’ని ప్రారంభించిన అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. జనాభా గణన అనేది అభివృద్ధి ఎజెండాకు ఆధారం అయ్యే ప్రక్రియ అని ఆయన అన్నారు.
Uttar Pradesh: ముగ్గురు వ్యక్తులు తన భార్య, 14 ఏళ్ల కుమార్తెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని రాంపూర్ లో ఈ ఘటన జరిగింది.