Salman Khan: జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ టాప్-10 హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. బిష్ణోయ్ గత కొంత కాలంగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడు. బిష్ణోయ్ కమ్యూనిటీ ఎంతో పవిత్రంగా భావించే కృష్ణ జింకలను 1998లో సల్మాన్ ఖాన్ వేటాడి చంపాడు. అప్పటి నుంచి లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్ ను అంతమొందించాలని చూస్తున్నట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది.
Read Also: Samantha: లిప్ లాక్ లే కాదు.. వెబ్ సిరీస్లో అంతకు మించి ఉంటాయట
గతేడాది డిసెంబర్ లో తన సహాయకుడు సంపత్ నెహ్రా సల్మాన్ ఖాన్ ను చంపేందుకు ముంబైలో రెక్కీ నిర్వహించడాని ఎన్ఐఏ ఎదుట లారెన్స్ బిష్ణోయ్ అంగీకరించాడు. అయితే హర్యానా పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ నెహ్రాను అరెస్ట్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 11న సల్మాన్ ఖాన్ కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. అతనికి ఈమెయిల్ చేసిన వ్యక్తిని కొద్ది రోజుల తర్వాత ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ కు ముప్పు పొంచి ఉందడటంతో ముంబై పోలీసులు అతని వై+ కేటగిరి భద్రతను కల్పించింది. లారెన్స్ బిష్ణోయ్ నుంచి చంపేస్తామంటూ బెదిరింపులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
ప్రస్తుతం బిష్ణోయ్ తీహార్ జైలులో ఉన్నాడు. 2021లో గోగీ గ్యాంగ్ కోసం గోల్డీ బ్రార్ ద్వారా అమెరికా నుంచి రెండు జిగాన సెమీ ఆటోమెటిక్ పిస్టల్స్ ను తీసుకున్నట్లు అంగీకరించాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కార్యాలయానికి బెదిరింపు ఈమెయిల్ పంపినందుకు ముంబై పోలీసులు గ్యాంగ్ స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, రోహిత్ గార్గ్‌లపై కూడా కేసు నమోదు చేశారు. సల్మాన్ తో పాటు సింగర్ సిద్దూ మూసేవాల మేనేజర్ షగత్ ప్రీత్ ను కూడా టార్గెట్ చేసినట్లు బిష్ణోయ్ వెల్లడించారు. సిద్ధు మూసేవాలా హత్య కేసులో నిందితుడు లారెన్స్ బిష్ణోయ్‌ని పంజాబ్ పోలీసులు గతేడాది అరెస్టు చేశారు.