Sidney: ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. 7 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భవనంలో భారీ ఎత్తున మంటుల చెలరేగాయి. భారీ మంటల కారణంగా భవనం కుప్పకూలింది.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 224 సీట్లకు గానూ 135 స్థానాల్లో జయకేతనం ఎగరేసింది.
AI face-swapping: ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ట్రెండ్ నడుస్లోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు తన జీవితాలను మరింత సులభతరంగా మార్చుకోవడానికి ఈ సాంకేతికత మరింతగా సాయపడుతోంది.
New Parliament: మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే, ఆప్, టీఎంసీతో సహా 19 పార్టీలు బహిష్కరించాయి.
Naveen Patnaik: పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా రాజకీయంగా రచ్చరచ్చగా మారింది. ఇప్పటికే ఈ ప్రారంభోత్సవానికి 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించాయి. కాంగ్రెస్ తో పాటు కమ్యూనిస్ట్ పార్టీలు, డీఎంకే, టీఎంసీ, ఆప్ వంటి పార్టీలు ప్రారంభోత్సవానికి రాబోమని చెప్పాయి. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా మే 28న కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాదని ప్రధాని కొత్త భవనాన్ని ప్రారంభించం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
Manipur Violence: మణిపూర్ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గత మూడు వారాలుగా ఈ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. మైయిటీ, కుకీ జాతుల మధ్య ఘర్షణ క్రమంగా హింసాత్మక మారాయి. తాజాగా ఈ రోజు మరోసారి మణిపూర్ లో హింస చెలరేగింది. తాజాగా బుధవారం చోటు చేసుకున్న హింసలో బుల్లెట్ గాయాలకు 29 ఏళ్ల యువకుడు మరణించాడు. వేరే వర్గానికి చెందిన వారు కాల్పులు జరపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో…
Meta Layoffs: ఫేస్బుక్, ఇస్టాగ్రామ్ మాతృసంస్థ మెటా తన మూడో రౌండ్ ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. ఇప్పటికే రెండు విడతల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఇన్స్టాగ్రామ్ లో క్రియేటర్ మార్కెటింగ్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కూడా కంపెనీ తొలగించింది.
IT companies: ఆర్థికమాంద్య భయాలు, ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం పరిస్థితులు ఐటీ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపుతున్నాయి. స్టార్టప్స్ నుంచి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చాయి.
US Debt Ceiling Crisis: అమెరికా ఆర్థిక సంక్షోభం అంచున నిలిచింది. అమెరికా రుణపరిమితి పెంచడంపై అధికార డెమోక్రాట్స్, విపక్ష రిపబ్లికన్ల మధ్య ఒప్పదం కుదరలేదు.
Manipur: సంక్షోభంలో చిక్కుకున్న మణిపూర్ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. చాలా చోట్ల బ్లాక్ దందా మొదలైంది. మూడు వారాల క్రితం మణిపూర్ లో గిరిజన, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి.