Jharkhand: సాధారణంగా ఒకే కాన్పులో కవలలు జన్మించారనేది వింటాం. అయితే కొన్ని సందర్భాల్లో చాలా అరుదుగా ఇద్దరి కన్నా ఎక్కువ మంది శిశువులు జన్మిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది రాజధాని రాంచీలోని రిమ్స్ లో సోమవారం ఓ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ప్రస్తుతం నవజాత శిశువులు తక్కువ బరువుతో ఉన్నారని, ఎన్ఐసీయూలో ఉంచినట్లు వైద్యులు వెల్లడించారు.
Read Also: Salman Khan: లారెన్స్ బిష్ణోయ్ టాప్-10 హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్..
ఐదుగురు శిశువులు ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. అయితే అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలా జరుగుతుందని తెలిపారు. ‘‘ఇత్‌ఖోరి ఛత్రాకు చెందిన మహిళ రిమ్స్ లోని ప్రసూతి, గైనకాలజీ విభాగంలో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. శిశువులు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్(NICU)లో ఉంచబడ్డారు. డాక్టర్ శశిబాలా సింగ్ విజయవంతంగా డెలివరీ చేశారు’’ అని రిమ్స్ తన ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొంది. వైద్యుల బృందం తల్లీ శిశువుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
रिम्स के महिला एवं प्रसूति विभाग में इटखोरी चतरा की एक महिला ने पांच बच्चों को जन्म दिया है। बच्चें NICU में डाक्टरों की देखरेख में हैं। डॉ शशि बाला सिंह के नेतृत्व में सफल प्रसव कराया गया। @HLTH_JHARKHAND pic.twitter.com/fdxUBYoPoP
— RIMS Ranchi (@ranchi_rims) May 22, 2023