No lungi or nighty: గ్రేటర్ నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ తీసుకువచ్చిన డ్రెస్ కోడ్ రూల్స్ వివాదాస్పదం అయ్యాయి. బహిరంగ ప్రదేశాలు, పార్కింగ్ ఏరియాల్లో లుంగీలు కట్టుకుని, నైటీలు ధరించి తిరగొద్దని రూల్స్ జారీ చేసింది. ఈ అపార్ట్మెంట్ ఏరియా గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ 2లో ఉంది. దీని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జూన్ 10న జారీ చేసిన సర్క్యులర్ ప్రస్తుతం తెగవైరల్ అవుతోంది. అయితే ఈ నిర్ణయంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. అయితే కొందరు మాత్రం దుస్తులు ధరించడం వారి వ్యక్తిగతమైన ఎంపిక అని, ఈ రూల్స్ ద్వారా వారి హక్కుల్ని హరించడమే అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Karnataka: ఫ్రీ అంటే ఇలా ఉంటుంది.. కర్ణాటకలో “ఫ్రీ బస్” ఎఫెక్ట్..
‘‘సమాజంలో మీరు తిరిగే ప్రతిసారి మీ ప్రవర్తన, వేషధారణపై మీరందరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని భావిస్తున్నారు. మీ ప్రవర్తనపై ఎవరికీ అభ్యంతరం చెప్పే అవకాశం ఇవ్వకండి. మీ పిల్లలు కూడా మీ నుంచి నేర్చుకుంటారు. నైటీ, లుంగీలను ఇంట్లో ధరించండి, ఫ్లాట్ల వెలుపల వాటిని ధరించకూడదని ప్రతి ఒక్కరూ అభ్యర్థించారు” అని హింసాగర్ అపార్ట్‌మెంట్ కార్యదర్శి హరిప్రకాష్ జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.
మాకు సొసైటీకి చెందిన కొంతమంది నుంచి ఫిర్యాదులు అందాయని, కొందరు పార్కుల్లో ఇలాంటి దుస్తులు వేసుకుని నడుస్తున్నారని, అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో వదులుగా ఉండే దుస్తులు ధరించి కొందరు నిత్యం యోగా చేస్తున్నారని, వాటిపై ఫిర్యాదులు వచ్చినందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని, తొలుత వారికి మౌఖికంగా చెప్పామని మార్పు రాకపోవడంతో సర్క్యులర్ జారీ చేశామని, ఇందులో ఎవరిపై వివక్ష చూపించడం లేదని అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సీకే కల్రా మీడియాలో చెప్పారు. తాము ఎవరి మనోభావాలను కించపరచలేదని, ఏ రకమైన దుస్తులను నిషేధించలేదని, ఇతరులకు అసౌకర్యంగా అనిపించే బట్టలతో తిరగవద్దని మాత్రమే అభ్యర్థించామని అన్నారు.