Japan: గత శతాబ్ధకాలంలో మారని చట్టాలను జపాన్ తాజాగా మార్చింది. ప్రపంచంలో అతితక్కువ సెక్స్ సమ్మతి వయసు ఉన్న జపాన్ ఇప్పుడు దాన్ని పెంచింది. సెక్స్ వయోపరిమితిని 13 ఏళ్ల నుంచి 16కి పెంచింది. దీంతో పాటు అత్యాచారాన్ని పునర్నిర్వచించింది. శుక్రవారం జపాన్ పార్లమెంట్ సెక్స్ క్రైమ్ చట్టాలను సవరించింది. మానవహక్కుల సంఘాలు ప్రభుత్వం చర్యలను స్వాగతించాయి. ప్రస్తుతం 16 ఏళ్ల కన్నా తక్కువ వయసులో ఏదైనా లైంగిక చర్యలకు పాల్పడితే దాన్ని అత్యాచారంగా పరిగణిస్తామని నిబంధనలు తీసుకువచ్చారు.
Supreame Court: రైలు ప్రయాణంలో దొంగతనం చేయడం రైల్వేకు సంబంధం లేదని, ఇది రైల్వే శాఖ సేవల్లో లోపం కాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రయాణికుడు తన సొంత వస్తువులను రక్షించుకోలేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టర్ బాధ్యత వహించలేమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఒక వ్యాపారవేత్తకు రూ. 1 లక్ష చెల్లించాలని రైల్వేని ఆదేశించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) ఉత్తర్వును పక్కన పెడుతూ న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Nehru Museum Renamed: నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ సొసైటీగా మార్చాలని కేంద్రం ఇటీవల నిర్ణయించింది
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటి నుంచే అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి.
Madhyapradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ రైట్ వింగ్ గ్రూప్ వివాదాస్పద ప్రకటన చేసింది. ముస్లిం మహిళతో పారిపోయిన హిందూ యువకులకు రివార్డ్ ప్రకటించింది. రూ. 11,000లను బహుమతిగి ఇస్తామని చెప్పింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మతాంతర వివాహాలను నిరోధించే లక్ష్యంతో రాష్ట్రప్రభుత్వం మత స్వేచ్ఛ చట్టం 2021 ఉన్నప్పటికీ.. హిందూ ధర్మ సేన అనే సంస్థ ఈ ప్రకటన చేసింది. హిందూ ధర్మ సేన అధ్యక్షుడు యోగేష్ అగర్వాల్ ఈ ప్రకటన చేశాడు.
AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) చుట్టూనే ప్రస్తుతం టెక్ ప్రపంచం తిరుగుతోంది. గూగుల్ తో సహా పలు కంపెనీలు ఏఐని అభివృద్ధి చేస్తున్నాయి. రానున్న కాలంలో AI టెక్నాలజీ శాసిస్తుందని చెబుతున్నారు. ఇది ప్రపంచ మానవాళి జీవితాన్ని మరింత సులభంగా మారుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంేట దీని వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో..లోపాలు అంతకన్నా ఎక్కువగా ఉంటాయని చాలా మంది అగ్రశ్రేణి టెక్ సీఈఓలు నమ్ముతున్నారు.
Devendra Fadnavis: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సావర్కర్, హెడ్గేవార్ సిలబస్ ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించింది. గతంలో బీజేపీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో చేసిన మార్పులన్నింటిని రద్దు చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్,
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత ప్రపంచ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు.
Bengaluru: 8 ఏళ్ల వయసున్న బాలిక చెప్పిన అబద్ధం, తప్పుడు ఆరోపణ ఓ ఫుడ్ డెలివరీ బాయ్ ప్రాణాలు మీదికి తీసుకువచ్చింది. ఫుడ్ డెలివరీ బాయ్ తనను బలవంతంగా టెర్రస్ పైకి తీసుకెళ్లాడని చెప్పడంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు, అపార్ట్మెమెంట్ లోని ప్రజలు చితకబాదారు. ఈ ఘటన బెంగళూర్ లోని ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతంలో జరిగింది. అయితే, బాలిక ఒంటరిగా టెర్రస్ పైకి వెళ్లినట్లు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. బాలిక తల్లిదండ్రులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లిన సందర్భంలో ఈ ఘటన జరిగింది.