Amazon Prime Lite: అమెజాన్ ప్రైమ్ భారతదేశంలో తన బేస్ విస్తరించేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే తాజాగా ‘అమెజాన్ ప్రైమ్ లైట్’ని తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన సబ్‌స్క్రిప్షన్‌ను ప్రారంభించింది. రెగ్యులర్ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ వలే కాకుండా తక్కువ ధరకే లైట్ సభ్యత్వాన్ని కల్పిస్తోంది. గతంలో అమెజాన్ సబ్ స్క్రిప్షన్ ధర ఏడాదికి రూ. 999గా ఉండేది. అయితే ఇప్పుడు దీని ధ రూ. 1499గా ఉంది. పెరిగిన ధర కారణంగా చాలా మంది యూజర్లు ప్లాన్ రెన్యువల్ చేసుకునేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో యూజర్ బేస్ పెంచుకునేందుకు ఈ కొత్త లైట్ ప్లాన్ తీసుకువచ్చింది. దీని ధరను రూ. 999గా నిర్ణయించింది.
అయితే అమెజాన్ ప్రైమ్ రెగ్యులర్ సబ్‌స్క్రిప్షన్ లాగే అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్ స్క్రిప్షన్ ఉంటుంది. అందులో ఉన్న ప్రయోజనాలే ఇందులో కూడా ఉంటాయి. అయితే రెగ్యులర్ ప్రైమ్ లాగా త్రైమాసిక, నెల వారి సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు లైట్ లో ఉండవు. లైట్ ప్లాన్ ఒకేసారి ఏడాదికి తీసుకోవాల్సి ఉంటుంది. లైట్ ప్లాన్ ను గతంలో కొంతమందికే అందుబాటులోకి తెచ్చింది. కాగా ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెచ్చింది.
Read Also: Adipurush Benefit Show: ఆదిపురుష్ మొదటి బెనిఫిట్ షో ఎక్కడో తెలుసా?
ప్రైమ్ వర్సెస్ ప్రైమ్ లైట్..
లైట్ సబ్‌స్ర్కి్ప్షన్ తీసుకున్నవారు అమెజాన్ నుంచి రెండ్రోజుల డెలివరీ, స్టాండర్డ్ డెలివరీలను ఉచితంగా పొందవచ్చు. అయితే ఈ రెండింటిలో దాదాపుగా అన్ని ప్రయోజాలు సేమ్ ఉన్నప్పటికీ.. లైట్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారు కొన్నింటిని మిస్ కాకతప్పదు. రెగ్యులర్ ప్రైమ్ మెంబర్ షిప్ లో వన్ డే డెలివరీ, సేమ్ డే డెలివరీ సదుపాయం లైట్ లో కుదరదు.
ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ మ్యూజిక్ యాక్సెస్ చేయలేము. రెగ్యులర్ ప్రైమ్ యూజర్లు ఒకేసారి 6 డివైజుల్లో 4k రెజల్యూషన్ తో వీడియోలను వీక్షించవచ్చు. అయితే లైట్ లో హెచ్‌డీ క్వాలిటీతో వీడియోలను వీక్షించవచ్చు. సేమ్ టైం లో రెండు డివైజుల్లో మాత్రమే చూడొచ్చు. ఫైమ్ లైట్ లో యాడ్స్ కూడా ఉంటాయి. నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం లేదు.