Vande Bharat Train: తెలంగాణ రాష్ట్రానికి మరో వందేభారత్ ట్రైన్ రాబోతోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ నడుస్తోంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది భారత రైల్వే. సికింద్రాబాద్-నాగ్ పూర్ మధ్య వందేభారత్ రైలు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే ఈ రూట్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రయల్ రన్స్ పూర్తయ్యాయి. సాధారణ కార్యకలాపాలకు అనువుగా ఉందని రైల్వే శాఖ నిర్థారణకు వచ్చింది.
ఈ వందే భారత్ రైలు మహారాష్ట్రలోని నాగ్ పూర్ నగరాన్ని, హైదరాబాద్ నగరంతో అనుసంధానం చేస్తుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య ప్రమాణకాలం మరింత తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలు పట్టణాలకు, హైదరాబాద్ ను మరింత మెరుగ్గా అనుసంధానించనుంది. ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం ప్రయాణ కాలం 2 గంటలు తగ్గనుంది.
Read Also: New Zealand: ఆర్థిక మాంద్యంలో న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ
స్టాప్స్ ఇవే..
సికింద్రాబాద్ నుంచి ప్రారంభమయ్యే వందేభారత్ ఎక్స్ ప్రెస్ కి కాజీపేట, రామగుండం, మంచిర్యాల, సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో హాల్టింగ్ సదుపాయం ఉంటుందని భావిస్తున్నారు. మహారాష్ట్రలోని బల్హార్షాలో స్టాప్ ఉండనుంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు ఈ రైలు సదుపాయం కలిసి వస్తుందని భావిస్తున్నారు.
సికింద్రాబాద్ నుంచి మరిన్ని వందేభారత్ ట్రైన్స్..
ఇక రానున్న కాలంలో హైదరాబాద్ నుంచి పూణే, బెంగళూర్ నగరాలకు వందేభారత్ ట్రైన్స్ నడపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్-వైజాగ్, సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి సానుకూల స్పందన లభించింది. దీని ఫలితంగా సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు రెండు దిశలలో 130% కంటే ఎక్కువ ఆదరణ లభించింది. ప్రయాణీకుల నుండి డిమాండ్‌కు ప్రతిస్పందనగా, రైలులోని కోచ్‌ల సంఖ్యను రెట్టింపు చేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. కోచ్ ల సంఖ్యను 8 నుంచి 16కు పెంచింది.
సికింద్రాబాద్-పూణే శతాబ్ది సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్థానంలో సికింద్రాబాద్-పూణే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను మార్చాలని కేంద్రం పరిశీలిస్తోంది. శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం సికింద్రాబాద్ నుండి పూణే వరకు పరిమిత స్టాప్‌లతో 8.25 గంటల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు అధునాతన సేవలను అందించాలని రైల్వే భావిస్తోంది.