Opposition Meeting: జాతీయ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన నేడు విపక్షాల సమావేశం జరగబోతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అడ్డుకోవడమే ధ్యేయంగా ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాట్నా చేరుకున్నారు.
PM Modi: యూఎస్ కాంగ్రెస్ వేదికగా ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని మోడీ. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఇఫ్స్ అండ్ బట్స్ లేవని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న మరియు ఎగుమతి చేస్తున్న అటువంటి దేశాలను కట్టడి చేయాలని అన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, దానిని ఎదుర్కోవడంలో ఎలాంటి అపోహలు ఉండవని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. గురువారం అమెరికా కాంగ్రెస్ ఉభయసభల సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Care Hospitals: హైదరాబాద్‌లోని 22nd జూన్ 2023: మలక్‌పేట్‌లోని కేర్హాస్పిటల్స్, ఈరోజు 80 ఏళ్ల మహిళా రోగిశ్రీమతి చిదమ్మ (పేరు మార్చబడింది)పై ‘వెర్టెబ్రా-స్టెంటోప్లాస్టీ’ అనేఅరుదైన మరియు సంక్లిష్టమైన వెన్నెముక ప్రక్రియను నిర్వహించింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లోని కేర్ హాస్పిటల్స్‌లోని సీనియర్ న్యూరోసర్జన్డాక్టర్ కె వి శివానంద్‌రెడ్డి మరియు అతని బృందం విజయవంతంగానిర్వహించిన ఈ ప్రక్రియ వెన్నెముకనొప్పిని తగ్గించి, తక్కువ సమయంలో చలనశీలతను పునరుద్ధరించడం ద్వారా వెన్నెముక పగుళ్ల చికిత్సలో విప్లవాత్మక మార్పులు చేసింది.
Uddhav Thackeray: మహారాష్ట్రలో సరికొత్త వివాదం వెలుగులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే టార్గెట్ గా ముంబైలో పలు ప్రాంతాల్లో బ్యానర్లు వెలిశాయి.
H-1B Visa: ప్రధాని నరేంద్రమోడీ మూడు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికాల మధ్య బంధం మరింత బలపడనుంది. రక్షణ, సాంకేతిక విషయాల్లో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే మోడీ పర్యటన వేళ.. అమెరికా భారతీయులకు శుభవార్త చెప్పబోతున్నట్లు తెలుస్తోంది.
House sales: హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో ఈ ఏడాది నివాస గృహాల విక్రయాల్లో 8-10 శాతం వృద్ధి నమోదు అవుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ, డిమాండ్ మెరుగ్గా ఉండటంతో దేశంలోని ఆరు నగరాల్లో ఈ ఏడాది ఇళ్ల విక్రయాలు పెరుగుతాయని తెలిపింది. వసూల్లు బాగుండటంతో పాటు రుణభారం తక్కువగా ఉండటంతో డెవలపర్ల క్రిడెట్ ప్రొఫైల్ కూడా బలోపేతం అవుతాయని నివేదిక తెలిపింది.