YouTube Down: ప్రముఖ వీడియో ప్లాట్ ఫామ్ యూట్యూబ్ డౌన్ అయింది. గురువారం రాత్రి 8 గంటల వరకు వేలాది మంది యూజర్లకు యూట్యూబ్ సేవలే నిలిచిపోయాయి. యూట్యూబ్, యూట్యూబ్ టీవీ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Downdetector.com ప్రకారం తెలిపింది. యూట్యూబ్ వేలాది మంది యూజర్లు తమకు సేవలు నిలిచిపోయినట్లు నివేదించారు. 13,000 కంటే ఎక్కువ ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నట్లు సదరు వెబ్సైట్ తెలిపింది. యూట్యూబ్ టీవీలో అంతరాయం ఏర్పడినట్లు 3000 కంటే ఎక్కువ నివేదికలు వచ్చాయి.
Read Also: Titan: సముద్రంలో పేలిపోయిన “టైటాన్”.. విధ్వంసానికి కారణం ఇదే..
ఇటీవల కాలంలో పలు వెబ్ సైట్లు డౌన్ అవుతున్నాయి. ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలు చేసిన అనంతరం పలుమార్లు ఇలా సేవలు నిలిచిపోయాయి. ట్విట్టర్ డౌన్ అయింది. కొన్ని నెలల ముందు వాట్సాప్ కూడా ఇలాంటి అంతరాయాన్నే ఎదుర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా వీటి సేవలు నిలిచిపోయాయి.