Opposition Meeting: నేడు పాట్నా వేదికగా విపక్షాల సమావేశం.. బీజేపీని అడ్డుకోవడమే టార్గెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Opposition Meeting: జాతీయ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. పాట్నా వేదికగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన నేడు విపక్షాల సమావేశం జరగబోతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అడ్డుకోవడమే ధ్యేయంగా ఈ సమావేశం జరగబోతోంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాట్నా చేరుకున్నారు. గురువారం ఆమె ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌ని కలిశారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ తో సమావేశమయ్యారు. నితీష్ తో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. మేమంతా ఒకే కుటుంబంగా కలిసి పోరాడుతామని విపక్షాల ఐక్యత గురించి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
మరోవైపు శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి పాట్నా బయలుదేరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ, కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధులు తదితరులు హాజరుకానున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో విపక్షాలన్ని సమావేశమవుతున్నాయి. 1974లో ఇందిరాగాంధీని గద్దె దించడానికి జయప్రకాష్ నారాయణ చేసిన విధంగానే ఈసారి నితీష్ కుమార్ చేయాలని భావిస్తున్నారు.
Also Read
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
విపక్షాల్లో లుకలుకలు:
ఇదిలా ఉంటే భేటీకి ముందే విపక్షాల్లో లుకలుకలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఎల్డీ ప్రెసిడెంట్ జయంత్ చౌదరి ఈ సమావేశానికి రానని ప్రకటించారు. దీన్ని ఒక కుటుంబ కార్యాక్రమంగా ఆయన అభివర్ణించారు. మరోవైపు బీఎస్పీ చీఫ్ మాయావతికి ఈ సమావేశానికి ఆహ్వానం అందలేదు. ఇక వైసీసీ, తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీ అధినేతలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించలేదు.
కాంగ్రెస్ పార్టీతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి పొసగడం లేదు. బీజేపీ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ గురించి కాంగ్రెస్ ఆప్ కు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. ఇక బెంగాల్ లో కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తే మద్దతు ఇవ్వలేనని ఇప్పటికే మమతా చెప్పారు. ఈ నేపథ్యంలో వీరందరి మధ్య సయోధ్య కుదురుతుందా..? లేదా.? అనేది ప్రశ్నగా మారింది. మరోవైపు యూపీలో బీజేపీ ఓడించాలంటే అన్ని పార్టీలు తమ వెనక నిలబడాలని సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కోరుతున్నారు.
ప్రతిపక్షాల ఐక్యతపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ మాట్లాడుతూ.. అవినీతి అంతా ఒక్క చోట చేరుతోందని అన్నారు. ముందుగా మీ ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియజేయాలని బీజేపీ ఎద్దేవా చేస్తోంది.
తాజావార్తలు
-
Shiva: జపాన్లో నాగార్జున ‘శివ’ సునామీ.. జపాన్ ఫ్యాన్స్ ఇచ్చిన ఆ బిరుదు చూశారా?
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..