Sudan: సూడాన్ దేశం సైనిక వర్గాల మధ్య ఘర్షణతో అట్టుడుకుతోంది. దేశంలో సైన్యం, పారామిలిటరీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. 12 వారాలుగా ఈ ఘర్షణ జరుగుతూనే ఉంది. ఈ రెండు విభాగాలకు చెందిన అధిపతుల మధ్య పోరు మొత్తం దేశాన్ని అతలాకుతలం చేస్తుంది.
Threads: ట్విట్టర్కి పోటీగా మెటా తీసుకువచ్చిన థ్రెడ్స్ దుమ్మురేపుతోంది. మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఒక్క రోజులోనే ప్రపంచ వ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క రోజులోనే 4 కోట్ల డౌన్లోడ్స్ జరిగాయి.
Orissa High Court: సహజీవనంపై ఒరిస్సా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కలిసి ఉండీ సెక్స్ చేసుకుని వివాహం చేసుకుంటాననే వాగ్దానాన్ని ఉల్లంఘిస్తే దాన్ని అత్యాచారంగా పరిగణించలేం అని ఒడిశా హైకోర్టు వ్యాక్యానించింది. భువనేశ్వర్ కు చెందిన ఓ వ్యక్తి ఎదుర్కొంటున్న అత్యాచారం ఆరోపణల్ని కోర్టు కొట్టేసింది.
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 500 రోజుల మార్క్ ను చేరుకుంది. గతేడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ యుద్ధం ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది.
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హింస రాజ్యమేలుతోంది. ఎప్పుడైతే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడిందో అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో పలు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ
USA: మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల కన్వెన్షన్ ప్రకారం అమెరికా తన దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేసిందని అధ్యక్షుడు జో బిడెన్ శుక్రవారం ప్రకటించారు. అమెరికా తన చివరి రసాయన ఆయుధాలను సురక్షితంగా ధ్వంసం చేసినందుకు గర్వపడుతున్నానని.. రసాయన ఆయుధాలు భయం లేని ప్రపంచానికి మమ్మల్ని ఒక అడుగు దగ్గర చేసిందని బైడెన్ చెప్పారు.
Pakistan: భారతదేశానికి ధీటుగా మా ఆర్మీ ఉంది, ఎప్పుడైనా కాశ్మీర్ ను రక్షించుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికే పాకిస్తాన్ ఇప్పుడు ఆ దేశ సైన్యానికి తిండి పెట్టే పరిస్థితుల్లో కూడా లేదు. చివరకు పాకిస్తాన్ ఆర్మీ తీవ్ర ఇంధన సంక్షోభాన్ని చవిచూస్తోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కూడా తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది.
Honey Trap Case: డీఆర్డీఓ శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వలపువలతో చిక్కుకున్నాడు. ప్రస్తుతం అతడిని అధికారులు విచారిస్తున్నారు. అయితే విచారణలో విస్తూ పోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జరా దాస్గుప్తా అనే పేరుతో ప్రదీప్ కురుల్కర్ ను హనీట్రాప్ చేశారు.
Meat Eating Bacteria: దోమల ద్వారానే చాలా వ్యాధులు మనుషులకు వ్యాపిస్తుంటాయి. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, పైలేరియా, జికా వంటి ప్రమాదకరమైన వ్యాధుల వ్యాప్తికి దోమలే వాహకాలుగా పనిచేస్తుంటాయి. దోమలు మానవుడిని కుట్టిన సమయంలో ఈ బ్యాక్టీరియా, వైరస్ లు మానవ శరీరంలోకి చేరి జబ్బుల్ని కలిగిస్తుంటాయి. ఇది