Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. అభంశుభం తెలియన 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులంతా మైనర్లే. నిందితులు 10 నుంచి 14 ఏళ్ల వయసు ఉన్నవారే. చిన్నవయస్సులోనే ఇలాంటి అఘయిత్యానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన కర్ణాటకలోని కలబురిగిలో జరిగింది. అత్యాచారం చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని, ఐదో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Also: Health Tips: రోజూ వెల్లుల్లిని ఇలా చేసుకొని తాగండి.. ఏమౌతుందో మీరే చూడండి..
వివరాల్లోకి వెళ్తే.. జూలై 5న బాలిక ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో నలుగురు నిందితులు చాక్లెట్లు ఇస్తామని, 10 రూపాయాలు ఇస్తామని ఆశ చూపించారు. ఈ నలుగురు ఐదో వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపారు. బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక కుటుంబసభ్యులు కలబురిగి మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితులపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీలోని 366A (లైంగిక నేరం కోసం మైనర్ బాలిక కస్టడీ), 376 (జి) (గ్యాంగ్ రేప్), 506 (ప్రాణ బెదిరింపు) కింద నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. 10 నుంచి 14 ఏళ్లు ఉన్న నిందితులను కలబురిగిలోని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. 14 రోజలు పాటు కరెక్షన్ హోమ్ కు పంపారు. ఈ కేసులో తదుపరి విచారణ జరుగుతోంది.