Venu Goapl Reddy
Author- NTV Telugu-
Ravi River: పాకిస్తాన్‌కి షాక్.. రావి నది నీటిని నిలిపేసిన భారత్..
Ravi River: సింధు దాని ఉపనదుల జలాలను భారత్ సమర్థవంతంగా వాడుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నిర్మితమవుతున్న షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం తుదిదశకు చేరుకోవడంతో పాకిస్తాన్‌కి రావి నది నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోకి ప్రవహించే 1150 క్యూసెక్కుల రావి నది నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాల్లోని 32,000 హెక్టార్ల భూమికి సాగు నీరుగా ఇవ్వనున్నారు. -
Uttarakhand: ఆందోళనల్లో “ఆస్తి నష్టాన్ని రికవరీ చేసేందుకు బిల్లు”ని తీసుకురానున్న ఉత్తరాఖండ్..
Uttarakhand: దేశంలోనే తొలిసారిగా ‘యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)’ బిల్లును తీసుకు వచ్చి చరిత్ర సృష్టించిన ఉత్తరాఖండ్ మరో ప్రతిష్టాత్మక బిల్లుకు సిద్ధమవుతోంది. నిరసనల సందర్భంగా ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు బీజేపీ నేతృత్వంలోని సీఎం పుష్కర్ సింగ్ ధామి సర్కార్ ‘‘ఉత్తరాఖండ్ పబ్లిక్ మరియు ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ బిల్లు’’ని సోమవారం బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టనునంది. -
Bharat Jodo Nyay Yatra: సీట్ల పంపకం కుదిరింది.. రాహుల్ గాంధీ యాత్రలో అఖిలేష్ యాదవ్..
Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడంతో ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ రోజు జోడో యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా మీదుగా సాగుతున్న యాత్రలో అఖిలేష్ యాదవ్ చేరారు. రెండు పార్టీల నడుమ గత కొన్ని నెలులగా… -
Maratha quota: “నన్ను చంపేందుకు కుట్ర”.. ఫడ్నవీస్‌పై మరాఠా కోటా కార్యకర్త సంచలన వ్యాఖ్యలు..
Maratha quota: మహారాష్ట్రలో మరాఠా కోటా కోసం ఉద్యమిస్తున్న నాయకుడు మనోజ్ జరాంగే సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనను చంపేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. మనోజ్ జరాంగే ఆదివారం ముంబైకి మార్చ్‌ని ప్రకటించాడు. ఆయన నివాసం వెలుపల తెలుపుతామని అన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేయమని కొంతమందిని ప్రలోభ పెడుతున్నారని, ఈ కుట్రల వెనక దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడని, నన్ను చంపాలనుకుంటున్నాడని, నేను వెంటనే సాగర్ బంగ్లా( ముంబాయిలో మలబార్ హిల్‌లో ఫడ్నవీస్ అధికార నివాసం)కి మార్చ్… -
Gaming addict: ఆన్లైన్ గేమింగ్‌కి బానిస.. అప్పు తీర్చేందుకు కన్నతల్లినే కడతేర్చిన కసాయి..
Gaming addict: ఆన్లైన్ గేమింగ్స్‌కి యువత బానిసగా మారుతోంది. ఈ వ్యసనం కారణంగా అప్పుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే క్రూరమైన చర్యలకు పాల్పడుతున్నారు. అప్పుల బారి నుంచి రక్షించుకునేందుకు ఓ వ్యక్తి సొంత తల్లినే కడతేర్చాడు. పక్కా ప్లానింగ్ ప్రకారం.. తల్లిదండ్రుల పేరిటి ఇన్సూరెన్స్ చేయించి, వారిని చంపేందుకు ప్లాన్ చేశాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. -
Ajit Pawar: 65 శాతం కంటే ఎక్కువ మంది ప్రజలు మళ్లీ మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు..
Ajit Pawar: దేశంలో మెజారిటీ ప్రజలు మరోసారి నరేంద్రమోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని అన్నారు ఎన్సీపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్. బీజేపీతో పొత్తు పెట్టుకున్న అజిత్ పవార్ పలు సందర్భాల్లో ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్ర అదికార కూటమిలో ప్రతీ ఒక్కరూ మోడీని గెలిపించడానికి పనిచేస్తున్నామని అజిత్ పవార్ ఆదివారం అన్నారు. బారామతిలో రైతుల ర్యాలీని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. -
Government data: ఆహారంపై తక్కువ ఖర్చు చేస్తున్న భారతీయులు.. గృహ వినియోగ వ్యయ సర్వేలో కీలక విషయాలు..
Government data: భారతీయులపై చేసిన సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆహారంపై తక్కువగా ఖర్చు చేస్తున్నారని, ముఖ్యంగా బియ్యం, గోధుమల వంటి ప్రధానమైన వస్తువులపై తక్కువ ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ప్రాసెస్ చేసిన ఆహారం, టెలివిజన్లు, ఫ్రిజ్‌ల వంటి మన్నికైన వస్తువులపై ఎక్కువ ఖర్చు చేస్తున్నారని ప్రభుత్వ వినియోగ డేటా వెల్లడించింది. 11 ఏళ్ల తర్వాత కేంద్రం కీలకమైన వినియోగ వ్యయ సర్వే డేటాను వెల్లడించింది. -
Honour killing: వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నందుకు వ్యక్తి దారుణహత్య..
Honour killing: తమిళనాడులో పరువు హత్య జరిగింది. వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనే కోపంతో అమ్మాయి బంధువులు ఒక వ్యక్తిని దారుణంగా నరికి హత్య చేశాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతోనే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ నేరంలో అమ్మాయి బావ సహా ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడిని మెకానిక్‌గా పనిచేస్తున్న ప్రవీణ్(26)గా గుర్తించారు. ఈ ఘటన చెన్నై నగరంలోని పల్లికరణై సమీపంలో శనివారం చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన ప్రవీణ్‌ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి… -
PM Modi: అరేబియా సముద్రం నీటి అడుగున పూజలు నిర్వహించిన పీఎం మోడీ.. ఫోటోలు వైరల్..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు గుజరాత్ రాష్ట్రంలో పర్యటించారు. శ్రీకృష్ణుడు నడయాడిన నేలగా ప్రసిద్ధి చెందిన ద్వారక ప్రస్తుతం అరేబియా సముద్రంలో మునిగిందని భావిస్తుంటారు. పీఎం మోడీ అరేబియా సముద్ర నీటి అడుగున ద్వారకాధీశుడికి పూజలు నిర్వహించారు. శతాబ్ధాల క్రితం శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా సముద్ర అడుగు భాగంలో ఉందని హిందువులలు నమ్ముతారు. బెట్ ద్వారకా ద్వీపం సమీపంలో స్కూబా డైవింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్న పురాతన ద్వారక నగరం అవశేషాలను చూడవచ్చు. హిందూ గ్రంథాల్లో ఈ… -
Mother: ఇది తల్లేనా.. 16 నెలల బిడ్డను ఇంట్లో ఒంటరిగా వదిలి విహారయాత్రకు వెళ్లింది.. చివరకు..
Mother: అమెరికాలో దారుణం జరిగింది. ఓ దుర్మార్గపు తల్లి తన సంతోషం చూసుకుంది. తనకు ఓ బిడ్డ ఉందని మరిచి విహారయాత్రలకు వెళ్లింది. 16 ఏళ్ల పసిబిడ్డను ఒంటరిగా ఇంట్లో వదిలి డెట్రాయిట్, ప్యూర్టో రికోకు వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు వెళ్లింది. 10 రోజుల పాటు ఇంట్లో చూసుకునే వారు లేకుండా బిడ్డ ఉండటంతో మరణించింది. నిందితురాలైన మహిళను ఓహియో రాష్ట్రానికి చెందిన క్రిస్టెల్ కాండెలారియోగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె హత్యానేర విచారణ ఎదుర్కొంటోంది. మహిళ 16 నెలల కుమార్తెను ఒంటరిగా ఇంట్లోనే విడిచిపెట్టినట్లు…
తాజావార్తలు
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
Ramayana Part 1 Title: రణ్‌బీర్ కపూర్ బర్త్‌డే సర్ప్రైజ్.. ‘రామాయణ’ పార్ట్ 1 టైటిల్ ఇదే!
-
Share Nani: ఒక్క సినిమాకే సరిపోయింది.. మళ్లీ ‘నేచురల్ స్టార్’గానే నాని!
-
Gold Silver Price Today: పడిపోతున్న పసిడి ధర.. వరుసగా రెండో రోజూ భారీగా డౌన్
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!