China: డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి తన విష నైజాన్ని చాటుకుంది. భారత్ లోని అంతర్భాగాలైన అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటూ ‘స్టాండర్డ్ మ్యాపు’ని విడుదల చేసింది. చైనా చర్యలపై భారత్ తీవ్ర అభ్యతరం తెలిపింది, నిరసన వ్యక్తం చేసింది. ఇదే కాకుండా తైవాన్, దక్షిణ చైనా సముద్రంలోని జపాన్, వియత్నాం, బ్రూనై దేశాలకు చెందిన ప్రాంతాలను కూడా తన మ్యాపుల్లో కలిపేసుకుంది.
Read Also: Adhir Ranjan Chowdhury: కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ ఎత్తివేత
తాజాగా బుధవారం భారత అభ్యంతరాలపై చైనా బుధవారం స్పందించింది. ‘‘ చైనా స్టాండర్డ్ మ్యాప్స్ 2023 ఎడిషన్ చట్ట ప్రకారం దేశ సార్వభౌమాధికారం’’ అని వ్యాఖ్యానించింది. సంబంధిత పార్టీలు దీనిని నిష్పాక్షికంగా పరిగణిస్తాయని, దానిని అతిగా అర్థం చేసుకోవద్దని ఆశిస్తున్నామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది.
అంతకుముందు చైనా మ్యాపులపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇటువంటి చర్యలు సరిహద్దుల్లో పరిస్థితిని క్షిష్టతరం చేస్తాయని పేర్కొంది. చైనా చర్యలను ఆధారం లేని వాటిగా తిరస్కరించింది. దౌత్యమార్గాల ద్వారా భారత్ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ చెప్పారు.