రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మంచిరేవులలో ఉన్న సర్వే నంబర్ 491 భూమి ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ‘స్వస్తిక హౌసింగ్ సొసైటీ’ (Swastika Housing Society) , ‘నార్సింగి ఓల్డ్ ముస్లిం శ్మశాన వాటిక కమిటీ’ (Old Muslim Graveyard Committee) మధ్య ఈ స్థలం విషయంలో కొన్నేళ్లుగా రగడ సాగుతోంది. తాజాగా ఈ స్థలంలో సర్వే నిర్వహించడంతో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది.
1982లో స్వస్తిక కోఆపరేటివ్ సొసైటీ సుమారు 4 ఎకరాల 18 గుంటల భూమిని హైదర్ అలీ మీర్జా అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసింది. అయితే, 2008లో ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణం కోసం ప్రభుత్వం ఇందులో 2 ఎకరాల 3 గుంటల భూమిని సేకరించింది. మిగిలిన 2 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో సొసైటీ సభ్యులు బౌండరీలు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు, అదే సర్వే నంబర్‌లోని 2.3 గుంటల భూమిని హైదర్ అలీ తమకు దానం చేశారని, అది వక్ఫ్ బోర్డు గెజిట్‌లో కూడా ఉందని ముస్లిం శ్మశాన వాటిక కమిటీ వాదిస్తోంది.
ఈ భూ వివాదం కోర్టుకు చేరడంతో, హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు గత మార్చిలో ఒకసారి సర్వే చేశారు. అనంతరం సొసైటీ సభ్యులు అక్కడ పహారీ గోడ నిర్మించి సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే, కొందరు దుండగులు తమ సెక్యూరిటీ గార్డులపై దాడి చేసి బెదిరిస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, హైకోర్టు తాజా ఆదేశాల ప్రకారం పోలీసులు, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ (HMDA) , వక్ఫ్ బోర్డు అధికారులు భారీ బందోబస్తు మధ్య మళ్లీ సర్వే నిర్వహించారు.
Adani vs Ambani: అదానీ Vs అంబానీ .. 2025 లో ఎవరి సంపద పెరిగిందో తెలుసా!