Venu Goapl Reddy
Author- NTV Telugu-
Jio phone: క్వాల్కామ్ సహకారంలో జియో 5జీ ఫోన్.. రూ.10,000 లోపే ధర..
Jio phone: 2024 చివరి నాటికి సరసమైన ధరలో రిలయన్స్ జియో 5G మొబైల్‌ని అందించబోతోంది. క్వాల్కామ్ సహాకారంతో జియో ఈ ఫోన్‌ను భారతీయులకు అందుబాటులోకి తీసుకురాబోతోంది. కేవలం రూ. 10,000 కంటే తక్కవ ధరకే ఈ జియో ఫోన్‌ని అందించబోతున్నారు. భారతదేశంలో త్వరలో కొత్త 5జి జియో ఫోన్లను విడుదల చేయడానికి రిలయన్స్ జియోతో కలిసి పనిచేస్తున్నట్లు క్వాల్కామ్ ధృవీకరించింది. క్వాల్కామ్ చిప్ సెట్‌తో జియో ఫోన్ రావడం ఇదే తొలిసారి. ఈ ఏడాది చివరి నాటికి ఫోన్ లాంచ్ అవుతుందని తెలుస్తోంది.… -
Rajya Sabha Poll: కాంగ్రెస్‌కి షాక్.. బలం లేకున్నా ఎంపీ సీటు బీజేపీ కైవసం.!
Rajya Sabha Poll: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ బీజేపీకి వరంగా మారింది. హిమాచల్ ప్రదేశ్‌లోని ఒకే ఒక్క రాజ్యసభ ఎంపీ స్థానం బీజేపీ కైవసం చేసుకుంది. 68 మంది సభ్యులు ఉన్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉండీ, 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. 25 మంది ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ రాజ్యసభ స్థానాన్ని దక్కించుకోవడం ఆ పార్టీకి షాక్ ఇచ్చింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మె్ల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి జైకొట్టారు. -
BYD Seal EV: BYD నుంచి కొత్త ఎలక్ట్రిక్ కార్.. ఒక్క ఛార్జ్‌తో ఏకంగా 570 కి.మీ.
BYD Seal EV: చైనీస్ ఎలక్ట్రిక్ కార్ మేకర్ BYD మరో ఎలక్ట్రిక్ కార్ మోడల్ని భారత్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమువుతోంది. ఎలక్ట్రిక్ సెడాన్ కార్ బీవైడీ సీల్‌ని మార్చి 5న భారత్‌లో విడుదల చేయబోతోంది. దీనికి ముందు ఇండియాలో BYDకి రెండు ఎలక్ట్రిక్ మోడళ్ల ఉన్నాయి. BYD e6 ఎలక్ట్రిక్ MPVతో సహా BYD ఆటో.3 ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లు ఉన్నాయి. -
Jaya Prada: సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద “పరారీ”లో ఉన్నట్లు ప్రకటించిన కోర్టు..
Jaya Prada: మాజీ ఎంపీ, సినీ నటి జయప్రదని ‘పరారీ’ ఉన్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ప్రకటించింది. ఆమెపై ఉన్న రెండు కేసుల విచారణలో హాజరుకాకపోవడంతో ప్రత్యేక కోర్టు మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో, ఆమె బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అభ్యర్థిగా ఎన్నికల ప్రవర్తనా నియామావళిని ఉల్లంఘించినట్లు కేసులు నమోదయ్యాయి. -
Pakistan: రావి నది ప్రవాహాన్ని నిలిపేసిన భారత్.. ఇది “వాటర్ టెర్రరిజం” అంటూ పాక్ గగ్గోలు..
Pakistan: సింధు నదీ ఉపనది అయిన రావి నది నీటిని భారత్ నిలిపేసింది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. ఇప్పటికే చీనాబ్ నదీ నీటిని భారత్ డైవర్ట్ చేసింది, తాజాగా రావి నది నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు షాపుర్కండి బ్యారేజీని నిర్మించింది. ఈ బ్యారేజ్ వల్ల జమ్మూ లోని కథువా, సాంబా ప్రాంతాల రైతులకు సాగు నీరు అందించడమే కాకుండా, విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. దీని వల్ల పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు లాభపడనున్నాయి. సింధు నదీ జలాల ఒప్పందం ప్రకారం, మనకు హక్కుగా… -
Bihar: బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లకు షాక్.. బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు..
Bihar: ఓ వైపు లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. అధికార, విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. బీజేపీని గద్దె దించాలని భావిస్తున్న బీహార్‌లోని ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు షాక్ తగిలింది. ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాల ‘మహాగటబంధన్’ కూటమికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పార్టీల ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత అధికార బీజేపీలో చేరారు. -
Citizenship Rules: 3 దేశాల నుంచి వచ్చిన వారికి పౌరసత్వం.. వచ్చే నెలలో సీఏఏ రూల్స్ అమలు.?
Citizenship Rules: పొరుగు దేశాల నుంచి మతపరమైన వివక్ష ఎదుర్కొని, అక్కడ మైనారిటీలుగా ఉండీ, భారత్‌లో స్థిరపడిన వారికి పౌరసత్వం ఇచ్చే ‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)’ వచ్చే నెలలో అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఏఏ అమలు 2019లో దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. అయితే, ఇటీవల బీజేపీ నేతలు త్వరలోనే సీఏఏ అమలు అవుతుందనే వ్యాఖ్యలు చేశారు. -
Rajya Sabha Elections: రాజ్యసభ పోల్స్‌లో క్రాస్ ఓటింగ్.. 3 రాష్ట్రాల్లో బీజేపీకి మద్దతుగా ప్రతిపక్షాల ఓటు.!
Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లోని 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ జరిగింది. ఏడుగురు సమాజ్‌వాదీ(ఎస్పీ) ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు పలికారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 68 అసెంబ్లీ స్థానాల్లో 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రుల మద్దతు ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ సింఘ్వీ ఓటమి అంచున […] -
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. ఐసీయూలో ఉన్న మహిళకు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం..
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం జరిగింది. పేషెంట్‌ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన నర్సింగ్ స్టాఫ్ మహిళపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన అల్వార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఐసీయూలో చేరిన 24 ఏళ్ల యువతిపై నర్సింగ్ అసిస్టెంట్ అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఉపిరితిత్తలు ఇన్ఫెక్షన్ కారణంగా సదరు యువతి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు చిరాగ్ యాదవ్ తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపారు. -
Patanjali: “ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఆపేయండి”.. పతంజలి కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం..
Patanjali: ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబాకు చెందిన ‘పతంజలి’ తప్పుడు ప్రకటనలో కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి ఆయుర్వేద్ ‘తప్పుదోవ పట్టించే, తప్పుడు ప్రకటనల’ కేసులో కేంద్రం తీరుపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి ప్రకటనల ద్వారా దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఈ రోజు పేర్కొంది. ఇది చాలా దురదృష్టకరమని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!