PM Modi: మోదీకి అనుకూలంగా 80 శాతం భారతీయులు.. ప్యూ రిసెర్చ్ సెంటర్ సర్వేలో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: 2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు ‘ మూడ్ ఆఫ్ ది నేషన్’ ఫలితాలను ప్రకటించాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన స సర్వేలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీకి సుమారుగా 80 శాతం మంది భారతీయులు ఉన్నారని, ఇందులో చాలా మంది మోడీ ప్రధాని అయిన తర్వాత ప్రపంచస్థాయిలో భారత పలుకుబడి పెరిగిందని భావిస్తున్నట్లుగా సర్వే వెల్లడించింది.
ఈ సర్వే ఫిబ్రవరి నుంచి మే నెలల మధ్య జరిగింది. 30,800 మంది అభిప్రాయాలను, 23 దేశాలకు చెందిన వ్యక్తుల అభిప్రాయాలను వెల్లడించింది. మొత్తంగా భారతీయులు (79 శాతం) మంది అనుకూలంగా అభిప్రాయాలను కలిగి ఉండగా.. 55 మంది మోడీకి చాలా అనుకూలంగా ఉన్నట్లు తేలింది. 2024 ఎన్నికల్లో మూడోసారి మోడీనే ప్రధాని కావాలని బలంగా కోరుకుంటున్నట్లు వెల్లడించింది. కేవలం 5 శాతం మంది మాత్రమే మోడీకి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలిపింది.
Also Read
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
- Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
- Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
ప్రపంచంలో పలుకుబడి:
ప్యూ సర్వే సర్వే ప్రకారం 68 శాతం ఇండియన్స్ ప్రపంచంలో భారతదేశ ప్రభావం పెరిగిందని భావిస్తున్నారు. 19 శాతం తగ్గిందని భావిస్తున్నారు. జీ20లోని మెజారిటీ దేశాలు భారత్ కు అనుకూలంగా ఉన్నాయి. అయితే గత 15 ఏళ్లతో పోలిస్తే యూరపియన్ దేశాల సానుకూల సెంటిమెంట్ భారత్ పై తగ్గిందని తెలిపింది. ప్యూ సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారత్ పట్ల సానుకూలతను 46 శాతం మంది మధ్యస్తంగా వ్యక్తం చేశారు. 34 శాతం మంది ప్రతికూలంగా ఉన్నారు.
12 దేశాలకు చెందిన వారిని ఇంటర్నేషనల్ వ్యవహారాలపై ప్రధాన మంత్రి మోడీ సామర్థ్యంపై ప్రశ్నించగా.. 40 శాతం మంది విశ్వాసం లేదని, 37 శాతం మంది విశ్వాసం ఉందని చెప్పారు.
ఈ సర్వేలో చైనా, టర్కీ, సౌదీ అరేబియా, రష్యా వంటి జీ20 దేశాలను చేర్చకపోవడం గమనార్హం. చాలా యూరోపియన్ దేశాల్లో ప్రజాదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. ఫ్రాన్స్‌లో, భారతదేశం యొక్క అనుకూలమైన రేటింగ్ 15 సంవత్సరాల క్రితం 70% నుండి 2023 నాటికి కేవలం 39%కి పడిపోయింది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ 71 శాతం భారత్ కు అనుకూలంగా ఉంది.
ఆదే విధంగా 41 శాతం మంది భారతీయులు రష్యా ప్రభావం పెరుగుతుందని చెబితే.. 21 శాతం మంది తగ్గినట్లు అభిప్రాయపడ్డారు. 50 శాతం కన్నా ఎక్కువ భారతీయులు ఇటీవల కాలంలో అమెరికా ప్రభావం పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సర్వే చెప్పింది. చైనాపై 67 శాతం మంది ఇండియన్స్ ప్రతికూలంగా ఉన్నారు.
తాజావార్తలు
-
Volvo EX90 India Launch: భారత్లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!