G20 Summit: లగ్జరీ కార్‌కి ఒక్క రోజు రెంట్ రూ. 1 లక్ష.. అంతా జీ20 మహిమ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: భారత్ మరికొన్ని రోజుల్లో ప్రతిష్టాత్మక జీ20 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తోంది. సెప్టెంబర్ 9,10 తేదీల్లో ఢిల్లీలో ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అగ్రదేశాల అధినేతలు, అధికారులతో ఢిల్లీ పూర్తిగా సందడిగా మారనుంది. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్, కెనడా ప్రధాని ట్రూడో, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, వంటి అగ్రనేతలు ఈ సమావేశాలకు హాజరుకాబోతున్నారు.
ఇదిలా ఉంటే జీ20 సమావేశాల పుణ్యమా అని లగ్జరీ కార్ల అద్దెలు అమాంతం ఆకాశాన్ని అంటుతున్నాయి. సమ్మిట్‌కు లగ్జరీ కార్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీనికి తగ్గట్లుగానే ఒక రోజు అద్దె రూ. 1 లక్షకు చేరింది. ఇప్పటికే ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలోని దాదాపు 30 లగ్జరీ హోటళ్లు బుక్ అయ్యాయి.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
Read Also: Indian Tech Worker: కెనడా బాట పట్టిన భారత టెక్కీలు.. 12 నెలల్లో 15 వేల మంది..
ఈ సమ్మిట్ కోసం దాదాపుగా 29 మంది దేశాధినేతలు భారత్ వస్తున్నారు. జీ 20 దేశాల అధినేతలతో పాటు ఆహ్వానిత దేశాలకు చెందిన అగ్రనేతలు ఉన్నారు. ఇలా అగ్రనేతలకు, ఉన్నతాధికారులకు వీరిని సమ్మిట్ జరుగుతున్న ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు లగ్జరీ కార్లకు డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ ఉన్న కార్లలో మెర్సిడెస్ మేబ్యాక్ ఉంది, దీని కోసం అడిగే అద్దె ధర రోజుకు రూ. 1 లక్ష వరకు ఉంటుంది.మ మెర్సిడెస్ తో పాటు బీఎండబ్ల్యూ, ఆడి వంటి కార్లకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లు ట్రాన్స్‌పోర్ట్ సంస్థలు చెబుతున్నాయి.
అగ్రదేశాల అధినేతలు వస్తుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎన్ఎస్జీ, పారాకమాండోలు రంగంలో దిగారు. వీరితో పాటు ఆయా దేశాల అధినేతల సెక్యూరిటీ సిబ్బంది కూడా ఢిల్లీకి చేరుకుంటోంది. భద్రత కోసం అత్యధునిక ఏఐ కెమెరాలను, ఇతర టెక్నాలజీని వాడుతున్నారు. దీంతో పాటు అమెరికా సీఐఏ, యూకే ఎంఐ-6, చైనా నుంచి ఎంఎస్ఎస్ వంటి అంతర్జాతీయ గూఢాచార సంస్థలు బృందాలు తమ నాయకులు భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేయడానికి ఢిల్లీ చేరుకున్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!