Kiren Rijiju: తుక్డే-తుక్డే గ్యాంగ్ మాటలు నమ్మవద్దు.. చైనా మ్యాప్స్‌పై కేంద్ర మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kiren Rijiju: చైనా కొత్తగా విడుదల చేసిన మ్యాపుల్లో భారత భూభాగాలైన అక్సాయ్ చిన్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతాలు ఉండటం ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలకు కారణమైంది. భారత్, చైనా తీరుపై అభ్యంతరం చెబుతోంది. ఈ వ్యవహారంలో అధికార బీజేపీని టార్గెట్ చేస్తూ.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్ ను ఇలా చైనా మ్యాపుల్లో చూపడం చాలా తీవ్రమైనదిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కౌంటర్ ఇచ్చారు. భారత భూభాగాలనను రక్షించడంలో సాయుధ దళాలకు పూర్తి సామర్థ్యం ఉందని అన్నారు. ఇటీవల ఆయన అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ జిల్లాలో కమెంగ్ సెక్టార్ ని సందర్శించిన వీడియోను ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Also Read
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
- Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
Read Also: Amazon: “వర్క్ ఫ్రం హోం” చేస్తున్న ఉద్యోగులకు అమెజాన్ సీఈఓ లాస్ట్ వార్నింగ్..
స్వార్థపరులు, తుక్డే తుక్డే గ్యాంగ్ సభ్యుల తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, మన భూభాగం చాలా సురక్షితంగా ఉందని, మన సాయుధబలగాలకు సరిహద్దులను రక్షించగల సామర్థ్యం ఉందని కిరణ్ రిజిజు అన్నారు. సరిహద్దుల్లో మౌళిక సదుపాయాలను అభివృద్ధి చేయని కాంగ్రెస్ పార్టీ విధానాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిప్పికొట్టారని, ఇప్పుడు సరిహద్దుల్లో రోడ్లు, కీలకమైన మౌళిక సదుపాయాలు నిర్మించబడ్డాయని ఆయన అన్నారు. లడఖ్‌లో భారత్‌కు చెందిన భూమిని చైనా ఇప్పటికే ఆక్రమించిందని రాహుల్‌గాంధీ చెప్పడంపై బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకు ముందు ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. లడఖ్ లో ఒక్క అంగుళం భూమి కూడా పోలేదని ప్రధాని అబద్ధం చెప్పారని, చైనా ఆక్రమిస్తోందని లడఖ్ మొత్తానికి తెలుసు అని, దీనిపై ప్రధాని మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!