Venu Goapl Reddy
Author- NTV Telugu-
UAE: కోట్లలో విరాళం ఇచ్చి 900 మంది ఖైదీలను విడిపించిన భారతీయ వ్యాపారవేత్త..
UAE: యూఏఈలో శిక్ష పొందుతున్న ఖైదీలను విడిపించేందుకు భారతీయ వ్యాపారవేత్త ఆ దేశానికి భారీ విరాళాలను అందించారు. 62 ఏళ్ల ఫిరోజ్ మర్చంట్, ప్యూర్ గోల్డ్ జువెల్లర్స్ యజమాని తన ‘ ది ఫర్గాటెన్ సొసైటీ’ సాయంతో 20,000 మంది ఖైడీలకు సాయం చేశారు. 2024లో ప్రారంభంలో గల్ఫ్ దేశంలోని పలు జైళ్లలో ఉన్న 900 మంది ఖైదీలను విడిపించేందుకు ఏకంగా 1 మిలియన్ దిర్హామ్స్(సుమారు రూ. 2.5 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ఈ ఏడాది 3,000 మంది ఖైదీలను విడిపించాలని ఆయన లక్ష్యంగా… -
PM Modi: కాశ్మీర్లో పీఎం మోడీ మెగా ర్యాలీ.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాశ్మీర్ వేదిగకా మెగా ర్యాలీకి సిద్ధమవుతున్నారు. వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. అనంత్‌నాగ్ జిల్లాలో భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా ప్రధాని మోడీ కాశ్మీర్ లోయలో పర్యటించడం ఇదే తొలిసారి అవుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ కాశ్మీర్లో ఈ ఎన్నికల ర్యాలీని నిర్వహించబోతోంది. -
Heart attack: గుండెపోటుతో భర్త, ఏడో అంతస్తు నుంచి దూకి భార్య.. 24 గంటల్లో రెండు మరణాలు..
Heart attack: ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడింది. 24 గంటల్లో భార్యభర్తలు మరణించారు. ఘజియాబాద్‌లోని ఓ యువ జంట జూ సందర్శనకు వెళ్లారు. 25 ఏళ్ల అభిషేక్ అహ్లువాలి గుండెపోటుతో మరణించగా, అతని భార్య అంజలి షాక్ తట్టుకోలేక ఏడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. గతేడాది నవంబర్ 30న ఇద్దరికి వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
Space station: 2035 నాటికి సొంత “అంతరిక్ష కేంద్రం”.. ప్రధాని ప్రకటన..
Space station: 2035 నాటికి భారత్‌కి సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పడుతుందని, ఇది అంతరిక్ష విషయాలను కనుగొనేందుకు, అధ్యయనం చేసేందుకు దోహదపడుతుందని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు అన్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం(వీఎస్ఎస్సీ)లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో భారత వ్యోమగామని సొంత రాకెట్ ద్వారా చంద్రుడిపై దిగుతారని చెప్పారు. -
PM Modi: ‘కేరళలో శత్రువులు, బయట BFF’.. రాహుల్ గాంధీ వయనాడ్ సీటుపై మోడీ..
PM Modi: కేరళలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ లెఫ్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. సీపీఎం వయనాడ్ లోక్‌సభ స్థానానికి అన్నీ రాజాను అభ్యర్థిగా పేర్కొన్న ఒక రోజు తర్వాత ప్రధాని ఈ రెండు పార్టీల తీరుపై మంగళవారం విమర్శలు గుప్పించారు. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్ శత్రువులని, కానీ బయట BFF( బెస్ట్ ఫ్రండ్స్ ఫర్ఎమర్) అంటూ ఎద్దేవా చేశారు. -
West Bengal: ప్రధాని మోడీ బెంగాల్ పర్యటన నేపథ్యంలో.. భారీ ర్యాలీకి పిలుపునిచ్చిన మమతా బెనర్జీ..
West Bengal: పశ్చిమ బెంగాల్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో సందేశ్‌ఖలీ ప్రాంతంలో మహిళలు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలకు వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. గత రెండు వారాలుగా ఈ ప్రాంతం నిరసనలతో అట్టుడుకుతోంది. మహిళల ఆందోళనలకు బీజేపీ మద్దతు ఇచ్చింది. సందేశ్‌ఖలి ఘటన లోక్‌సభ ఎన్నికల ముందు మమతా బెనర్జీకి తీవ్ర ఇబ్బందిగా మారింది. -
SIMI Terrorist: 22 ఏళ్లుగా పరారీలో ఉన్న సిమి టెర్రరిస్ట్ హనీఫ్ షేక్ అరెస్ట్.. ఒకే క్లూతో చిక్కాడు..
SIMI Terrorist: నిషేధిత స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా(సిమి) ఉగ్రవాది హనీఫ్ షేక్ పోలీసులకు చిక్కాడు. 22 ఏళ్లుగా పరారీలో ఉన్న ఇతడిని ఢిల్లీ పోలీసుల ప్రత్యేక సెల్ ఫిబ్రవరి 22న అరెస్ట్ చేసింది. కేవలం ఒకే ఒక క్లూ అయిన అతని మారుపేరు సాయంతో భయంకరమైన ఉగ్రవాదిని పోలీసులు పట్టుకున్నారు. ఇతడికి హనీఫ్ షేక్, మహ్మద్ హనీఫ్ మరియు హనీఫ్ హుదాయి పేర్లు ఉన్నాయి. 2002లో పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించారు. -
Haryana: ఐఎన్ఎల్డీ చీఫ్ నఫే సింగ్ రాథీని కాల్చి చంపిన దుండగులు..
Haryana: హర్యానా ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) చీఫ్, మాజీ ఎమ్మెల్యే నఫే సింగ్ రాథీని ఈ రోజు సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఆయన ప్రయాణిస్తున్న ఎస్యూవీ కార్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఝజ్జర్ జిల్లాలో జరిగింది. అతనితో పాటు మరో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో వచ్చిన దుండగులు సమీపం నుంచి రాథీ, అతని అనుచరులపై కాల్పులకు తెగబడ్డారు. ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. -
Israel-Hamas War: గాజాలో ఆకలి కేకలు.. కలుపు మొక్కలు, పశుగ్రాసమే ఆహారం..
Israel-Hamas War: ఇజ్రాయిల్ హమాస్ మిలిటెంట్ల దాడి సాధారణ పాలస్తీనియన్లను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని దారుణంగా చంపేసింది. మరికొందరిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు మరణాల సంఖ్య 30,000లను దాటింది. ఇదిలా ఉంటే ఇప్పుడు గాజాలోని ప్రజలు ఆకలితో దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఆహారం, మందులు లేక విలవిల్లాడుతున్నారు. ఉత్తర గాజా నుంచి వేల మంది పాలస్తీనియన్లు […] -
Point Nemo: భూమిపై అత్యంత మారుమూల ప్రాంతం..అంతరిక్ష శ్మశానవాటికగా పేరు.. దీని విశేషాలు ఇవే..
Point Nemo: ‘పాయింట్ నిమో’ భూమిపై అత్యంత మారుమూల ప్రదేశం. సమీప మానవుడిని చేరుకోవాలంటే ఇక్కడ నుంచి వేల కిలోమీటర్లు వెళ్లాల్సింది. ఒకానొక సమయంలో ఈ ప్రదేశం నుంచి సమీపంలో ఉండే మానవులు ఎవరంటే.. భూమికి ఎగువన అంతరిక్షంలో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర(ఐఎస్ఎస్)లో నివసించే వ్యోమగాములే. ఈ పాయింట్ నుంచి ఐఎస్ఎస్ 400 కిలోమీటర్ల ఎగువన ఉంటుంది.
తాజావార్తలు
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
-
Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
-
Ramayana : రామాయణ ప్రీ పోన్.. మూడు రోజులు ముందుగా థియేటర్స్‌లోకి
-
Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!