Pakistan: ఆదివారం ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ టోర్నీలో పాక్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన ‘6-0’ సంజ్ఞపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, తాము 6 భారత విమానాలను కూల్చేశామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. దీనిపై అక్కడి మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించింది. తమ ఎయిర్ బేస్‌లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని కూడా పాకిస్తాన్ మరిచిపోతోంది.
Bihar Elections: బీహార్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్ మొదటి వారంలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ, ఆర్జేడీ కూటములు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇదిలా ఉంటే, బీహార్ ప్రాంతంలో సత్తా చాటాలని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఐఏఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం నుంచి, ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ‘‘సీమాంచల్ న్యాయ యాత్ర’’ను ప్రారంభించనున్నారు. అయితే, ఆర్జేడీ-కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష మహాఘటబంధన్‌లో […]
Su-57 fighter jets: భారతదేశానికి, మిత్రదేశం రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. రష్యా తన ఐదో తరం, స్టెల్త్ ఫైటర్ Su-57 విమానాలను భారత్‌కు ఆఫర్ చేసింది. మేరకు ఆ దేశ వార్తాసంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం, ఐదో తరం యుద్ధ విమానాలు కేవలం అమెరికా, రష్యా, చైనా వద్ద మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే, పాకిస్తాన్, చైనా నుంచి ఈ విమానాలను కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారత్‌కు ఫిఫ్ట్ జనరేషన్ ఫైటర్ జెట్స్ చాలా అససరం. Su-57…
H-1B Visa Fee: అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్, గత వారం H-1B వీసాలపై – $100,000(రూ. 88 లక్షలు) రుసుము విధించాలనే నిర్ణయంతో ఒక్కసారిగా భారతీయ టెక్కీలు ఉలిక్కిపడ్డారు. తమ అమెరికన్ డ్రీమ్స్‌కు ట్రంప్ చెక్ పెట్టారని భావించారు. కొత్త నిబంధనల ప్రకారం, అమెరికాలోకి ఎంట్రీ లభించదనే భయంతో చాలా మంది విదేశీ వర్కర్లు, ముఖ్యంగా భారతీయులు ఆందోళన చెందారు. అమెరికన్ టెక్ కంపెనీలు తమ H-1B వీసాలు కలిగిన ఉద్యోగులు అమెరికా విడిచి వెళ్లొద్దని, […]
H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న H-1B వీసా చర్యలు భారతీయుల్లో కల్లోలం నింపుతున్నాయి. చాలా ఏళ్ల తర్వాత తమ తల్లిదండ్రుల్ని, కుటుంబాలను కలవడానికి వచ్చిన వారు, పెళ్లి చేసుకునేందుకు వచ్చిన వారు అయోమయ స్థిలో పడ్డారు. తమ వివాహాలను రద్దు చేసుకుని, మళ్లీ అమెరికా ఫ్లైట్ ఎక్కుతున్నారు. హెచ్1బీ వీసాల రుసుము 1,00,000 డాలర్లు(రూ. 88 లక్షలు)కు పెంచుతూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం పెట్టాడు.
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మరోసారి అవే మాటలు వచ్చాయి. తానే ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానంటూ మరో సారి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే 40 కన్నా ఎక్కువ సార్లు పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 7 యుద్ధాలను ఆపినందుకు తనకు ‘‘నోబెల్ శాంతి బహుమతి’’ ఇవ్వాలని అన్నారు.
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. అయితే, ఏ అంశంపై ప్రధాని మాట్లాడుతారనే దానిపై అధికార వర్గాలు ధ్రువీకరించలేదు. దీంతో ప్రధాని ఏ అంశం మాట్లాడుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రసంగం జీఎస్టీ(GST) సంస్కరణలకు ముందు వస్తోంది.రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమలులోకి వస్తున్నాయి. ప్రధాని ప్రసంగంలో ఈ అంశం ఉండే అవకాశం ఉంది. మరోవైపు, అమెరికాతో టారిఫ్ […]
Bihar: బీహార్ ఎన్నికల్లో ఇటీవల ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్రమోడీ తల్లిని తిట్టడం వివాదంగా మారింది. కాంగ్రెస్ ఆమె ఏఐ వీడియోను ఉపయోగించి, ఒక వీడియోను రూపొందించడం వివాదస్పదమైంది. కోర్టులు ఈ వీడియోను డిలీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ర్యాలీలో ప్రధాని తల్లిని దూషిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రధాని తల్లి దివంగత హీరాబెన్ మోడీని విమర్శించారని బీజేపీ ఆరోపించింది. అయితే, ఆర్జేడీ నాయకులు మాత్రం ఈ వీడియో నకిలీది అని చెప్పింది.
India-Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తా్న్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. ఆ సమయంలో రెండు అణ్వాయుధ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత, పాకిస్తాన్ కాల్పుల విమరణకు బ్రతిమిలాడటంతో, రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది.
Bombay High Court: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌కు సమాధానం ఇచ్చింది. పీఓకే, పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే, మన దేశంలో కొంత మంది మాత్రం దీనిని సమర్థించకుండా, ‘‘ఆపరేషన్ సిందూర్’’కు వ్యతిరేక పోస్టులు పెడుతూ, పాకిస్తాన్ ప్రేమను చూపించారు. ఇలాంటి కేసును విచారిస్తున్న బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.