తెలుగు చిత్ర పరిశ్రమలో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, తన 43వ చిత్రంగా ‘వేదవ్యాస్’ అనే భారీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి సమర్పణలో, సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల నిర్మాత అచ్చిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా జరిగిన వేడుకలో ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న పిడుగు విశ్వనాథ్‌ను చిత్ర బృందం ఘనంగా పరిచయం చేసింది. భారతీయ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని, జ్ఞానం యొక్క విలువను చాటిచెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. గత ఐదారేళ్లుగా కృష్ణారెడ్డి ఈ స్క్రిప్ట్‌పై కసరత్తు చేసి, విభిన్నమైన నటీనటులతో ఈ విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నారు.
Also Read : Aishwarya Rai : ఆరాధ్యకు ఫోన్ లేదు.. ఐశ్వర్య రాయ్ కఠిన నిబంధనలు! అభిషేక్ బచ్చన్ షాకింగ్ రివీల్.
ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే, సౌత్ కొరియాకు చెందిన నటి జున్ హ్యున్ జీ హీరోయిన్‌గా నటిస్తుండగా, మంగోలియాకు చెందిన నటుడు విలన్‌గా నటిస్తున్నారు. హీరోయిన్ జున్ హ్యున్ జీ ఇప్పటికే తెలుగు నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ప్రముఖ నటుడు సాయి కుమార్ ఈ చిత్రంలో ‘వేద నారాయణ’ అనే అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఆయనతో పాటు మురళీ మోహన్, సుమన్, మురళీ శర్మ మరియు అజయ్ ఘోష్ వంటి సీనియర్ నటులు ఈ భారీ తారాగణంలో భాగమయ్యారు. హీరోగా పరిచయమవుతున్న విశ్వనాథ్ ప్రతి సన్నివేశంలో ఎంతో అద్భుతంగా నటించాడని, ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.