Pakistan: పాకిస్తాన్ ఒకే సారి రెండు దేశాలతో ప్రేమాయణం నడుపుతోంది. చైనాకు కన్నుగీటి, అమెరికాను కౌగిలించుకుంటోంది. తమ ఉక్కు స్నేహితుడిగా చైనాను, పాకిస్తాన్ పిలుస్తుంటుంది. అయితే, అలాంటి స్నేహితుడిని ఇప్పుడు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ నాయకత్వం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు దగ్గర అవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో విందులో పాల్గొన్నారు. ఇప్పుడు, పాకిస్తాన్ ప్రధాని కూడా ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
Afzal Guru Grave: ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి ఉగ్రవాదులు అప్జల్ గురు, మక్బూల్ భట్ సమాధులను తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజా ప్రయోజన వ్యాఖ్యం కింద నమోదైన ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం కొట్టేసింది. విశ్వ వేదిక్ సనాతన్ సంఘ్ దాఖలు చేసిన పిల్లో సమాధులు 'తీర్థయాత్ర' స్థలంగా మారాయని పేర్కొంది. అయితే, ఈ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీనిపై డేటాను కోరింది.
Pakistan: పాకిస్తాన్ తన చరిత్రను తప్పుగా చెప్పుకోవడం అలవాటు. ముఖ్యంగా, భారత్ విషయంలో ఏం జరిగినా, ఎన్ని యుద్ధాల్లో ఓడిపోయినా, చివరకు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్)ని కోల్పోయినా కూడా తమదే పై చేయి అని అక్కడి ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉంది. చివరకు విద్యార్థులకు నిజాలు తెలియకుండా, తప్పుడు అంశాలను స్కూల్ పాఠ్యాంశాలుగా చేర్చుతోంది. తాజాగా, మే నెలలో జరిగిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి కూడా అక్కడి టెక్ట్స్ బుక్స్‌లో తప్పుడు పాఠ్యాంశాన్ని చేర్చింది. […]
Trump: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ, భారత్, చైనాలపై విమర్శలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారత్, చైనా నిధులు ఇస్తున్నాయని మండిపడ్డారు. రష్యన్ చమురు కొనుగోలు ద్వారా ఈ రెండు దేశాలు రష్యాకు సహకరిస్తున్నాయంటూ ఆరోపణలు గుప్పించారు. భారత్, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారానే యుద్ధానికి ప్రాథమిక నిధుల్ని సమకూరుస్తోందని అన్నారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అవే కామెంట్స్ చేశారు. వేదిక ఏదైనా తాను నిర్మొహమాటంగా భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపాను అంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. తాజాగా, 80 యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో ట్రంప్ ప్రసంగించారు. తాను అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే అంతం లేని 7 యుద్ధాలను ఆపానంటూ చెప్పుకున్నారు.
USA: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీసీ) సమావేశాలకు ముందు అమెరికాలో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. టెలికాం సేవల్ని నిలిసేందుకు పన్నిన కుట్రను యూఎస్ సీక్రెట్ సర్వీస్ మంగళవారం భగ్నం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సహా, అనేక దేశాధినేతలు ప్రసంగించే సమయంలో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో తొలి ప్రసంగం చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇది జరిగింది.
GST Effect: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో, మార్కెట్లో కొనుగోళ్ల ప్రభావం కనిపిస్తోంది. పండగ సీజన్ కూడా కావడంతో మార్కెట్ లో సందడి నెలకొంది. సామాన్యుడికి అవసరమైన నిత్యావసరాలతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, బైకులు, కార్లపై గతంలో 28 శాతం ఉన్న జీఎస్టీని కేంద్రం 18 శాతానికి తగ్గించింది. తగ్గించిన జీఎస్టీ సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో, తగ్గిన ధరల కారణంగా తమకు అవసరమయ్యే వస్తువుల్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాటు నవరాత్రి, దీపావళి పండగకలు కూడా మార్కెట్‌కు ఊపునిచ్చింది.
India-China: చైనాను ఏ రకంగా కూడా నమ్మలేని, భారత్‌ను హెచ్చరిస్తూ టిబెల్ లీడర్ లోబ్సాంగత్ సంగే అన్నారు. ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ మాజీ అధ్యక్షుడు(సిక్యాంగ్) లోబ్సాంగ్ సంగే జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌ను ఆక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తోందని, భారత్ డ్రాగన్ దేశాన్ని ఎప్పుడూ నమ్మవద్దని హెచ్చరించారు. చైనా, భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు గ్రామాలకు పేర్లు మార్చడం, సరిహద్దుల్లో సైనిక మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో సంగే నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
Garba Rules: ఉత్తరాదిన నవరాత్రుల్లో జరిగే ‘‘గర్బా’’ వేడుకల కోసం పలు హిందూ సంఘాలు నిమయాలను రూపొందించాయి. పలు సందర్భాల్లో గర్భాలోకి అన్యమతస్తులు ప్రవేశించడం, గర్బా డ్యాన్సు చేస్తున్న మహిళల్ని వెక్కిరించడం లేకుంటే ప్రేమ పేరుతో మోసం చేయడం వంటి ఘటనలు జరిగాయి.
Lawrence Bishnoi: ఇద్దరు గ్యాంగ్స్టర్స్, రెండు గ్యాంగుల మధ్య వార్ ఇప్పుడు సంచలనంగా మారింది. గ్యాంగ్‌స్టర్ రోహిత్ం గోదారా, మరో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ని ‘‘దేశద్రోహి’’గా ఆరోపించాడు. బిష్ణోయ్ అమెరికా ఏజెన్సీతో కుమ్మక్కయ్యాడని, సున్నితమైన సమాచారాన్ని ఇస్తున్నట్లు వెల్లడించారు. ధ్రువీకరించని ఓ సోషల్ మీడియా పోస్ట్‌లో గోదారా, బిష్ణోయ్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు.