UP Crime: పొరుగింటి వారి తప్పుడు ఆరోపణలకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్ లక్నోలో బేకరీ యజమాని అయిన వీరేంద్ర యాదవ్ 6 పేజీల సూసైడ్ నోట్ రాసి, బలవన్మరణానికి పాల్పడ్డాడు. పొరుగింటి వారి తప్పుడు ఆరోపణలతో సమాజంలో పరువు పోవడం, తన కుమార్తె వివాహంపై ఆందోళనతో ఆయన ఈ తీవ్ర చర్య తీసుకున్నాడు. పొరుగింటి వారితో ర్యాంప్ నిర్మాణం గొడవతో ఈ వివాదం మొదలైంది.
Indus River: సింధు నది జలాల కోసం కేంద్రం కొత్త ప్లాన్‌తో సిద్ధమవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల దాహార్తిని, సాగు అవసరాలను తీర్చేందుకు కేంద్రం సింధు నది వ్యవస్థలో భారీ మార్పులు చేయాలని భావిస్తోంది. పాకిస్తాన్‌తో ‘‘సిందు జల ఒప్పందాన్ని’’ నిలిపేసిన తర్వాత, కేంద్రం ఈ వ్యూహాత్మక చర్యలు తీసుకుంటోంది. 2029 లోక్‌సభ ఎన్నికల ముందు ఈ ప్రాజెక్ట్ సిద్ధం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గత శుక్రవారం సీనియర్ మంత్రులు నిర్వహించిన సమీక్షా సమావేశంలో సింధు నదిని […]
Ladakh: లడఖ్‌కు రాష్ట్రహోదా డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు మరణించారు. 70 మందికి పైగా గాయపడ్డారు. కేంద్రపాలిత ప్రాంతంలో కేంద్ర పాలనకు వ్యతిరేకంగా లడఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ నిరసనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా బుధవారం కేంద్ర భూభాగంలోని లేహ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధించినట్లు తెలిపారు.
Maoists: కేంద్రం మావోయిస్టులకు వ్యతిరేకం నిర్వహిస్తున్న ‘‘ఆపరేషన్ కగార్’’ దెబ్బకు పలువురు మావోయిస్టుల లొంగిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో రూ.64 లక్షలు రివార్డు ఉన్న 30 మందితో సహా 71 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 17 బాలుడు, 16,17 ఏళ్లు కలిగిన ఇద్దరు మైనర్ బాలికలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని దంతేవాడ పోలీసులు వెల్లడించారు.
H-1B Visa Row: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కు పెంచడం ఒక్కసారిగా భారతీయ టెక్కీలో ఆందోళన నింపింది. తమ అమెరికన్ డ్రీమ్స్‌ను ట్రంప్ కాలరాస్తున్నాడనే ఆవేదన వ్యక్తమైంది. H-1B వీసా ఫీజు పెంపు విషయం గందరగోళంగా మారుతున్న తరుణంలో మేము ఉన్నామంటూ ఓ యూరోపియన్ దేశం ముందుకు వచ్చింది. భారత టెక్కీలు తమ దేశానికి రావాలని ఆహ్వానించింది.
Pahalgam Terror Attack: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిలో టెర్రరిస్టులకు సహకరించిన స్థానిక కాశ్మీర్ వ్యక్తులను అధికారులు గుర్తిస్తున్నారు. పహల్గామ్ బైసరన్ లోయలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది పర్యాటకుల్ని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఘటన జరిగిన 5 నెలల తర్వాత, భద్రతా సంస్థలు బుధవారం ఉగ్రవాదులకు లాజిస్టిక్ మద్దతు ఇచ్చిన కాశ్మీర్ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కుల్గాం నివాసి అయిన 26 ఏళ్ల మహ్మద్ యూసుఫ్ కటారియాను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని 14 రోజుల పోలీస్ కస్టడీకి పంపారు.
Finland: ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ భారతదేశంపై ప్రశంసలు కురిపించారు. రష్యా, చైనాల నుంచి భారత్‌ను వేరే చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న ‘‘సూపర్ పవర్’’గా కొనియాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు, శాంతి చర్చల్లో భారత పాత్రను నొక్కి చెప్పారు. సాంకేతికత-వాణిజ్యంలో సహకారం ద్వారా భారత్-ఫిన్లాండ్ సంబంధాలు బలోపేతం అవుతాయని అన్నారు.
UNGA: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 80వ సమావేశాల్లో ఉక్రెయిన్ యుద్ధం, గాజా యుద్ధం ముఖ్యాంశాలుగా నిలిచాయి. ప్రపంచ దేశాధినేతలు ముఖ్యంగా ఈ రెండింటిపైనే ప్రసంగించారు. అతిపెద్ద ముస్లిం దేశమైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఇచ్చిన ప్రసంసం వైరల్‌గా మారింది. ఈ యుద్ధాల ముగిసి ప్రపంచంలో శాంతి నెలకొనాలని ఆయన అన్ని మతాల్లో దేవుడిని ప్రార్థించారు.
Turkey: టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ‘‘కాశ్మీర్’’ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తారు. పలు సందర్భాల్లో ఎర్డోగాన్ భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్తాన్ కి అనుకూలంగా మాట్లాడారు. తాజాగా, మరోసారి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ( UNGA ) వార్షిక సమావేశంలో కూడా కాశ్మీర్ అంశంపై మాట్లాడారు.
Crime: ‘‘లాఫింగ్ ఎమోజీ’’ ఒకరి హత్యకు కారణమైంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ రాజ్‌కోట్‌లోని ఒక ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన 20 ఏళ్ల ప్రిన్స్ కుమార్ అతని ముగ్గురు బంధువులు పనిచేస్తున్నారు. నాలుగు నెలల క్రితంత తన తాత రూప్నారాయణ్ భింద్ మరణించారు. ఆయనను గుర్తు చేసుకుంటూ, ప్రిన్స్ ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు. అయితే, ప్రిన్స్‌కు పరిచయస్తుడైన బిపిన్ కుమార్ రాజిందర్ గోండ్ ఈ పోస్టుకు ‘‘నవ్వుతున్న ఎమోజీ’’ని పెట్టాడు. దీంతో ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు కారణమైంది.