Bihar: బీహార్ ఎన్నికల్లో ఇటీవల ప్రతిపక్షాలు ప్రధాని నరేంద్రమోడీ తల్లిని తిట్టడం వివాదంగా మారింది. కాంగ్రెస్ ఆమె ఏఐ వీడియోను ఉపయోగించి, ఒక వీడియోను రూపొందించడం వివాదస్పదమైంది. కోర్టులు ఈ వీడియోను డిలీట్ చేయాలని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ర్యాలీలో ప్రధాని తల్లిని దూషిస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రధాని తల్లి దివంగత హీరాబెన్ మోడీని విమర్శించారని బీజేపీ ఆరోపించింది. అయితే, ఆర్జేడీ నాయకులు మాత్రం ఈ వీడియో నకిలీది అని చెప్పారు.
బీహార్ బీజేపీ ఎక్స్‌లో తేజస్వీ యాదవ్-ఆర్జేడీ ర్యాలీలో ప్రధాని తల్లిని దూషిస్తున్నట్లు చూపిస్తున్న వీడియోను షేర్ చేసింది. ఆర్జేడీ నిర్వహిస్తున్న బీహార్ అధికార్ యాత్రలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీ షేర్ చేసిన వీడియోలో తేజస్వీ మాట్లాడుతుంటే, ఒక వ్యక్తి ప్రధానిని, ఆయన తల్లిని దుర్భాషలాడటం వినవచ్చు.
Read Also: Theft: లోన్ యాప్ అప్పులు తీర్చేందుకు.. ఆడవేశంలో వచ్చి స్నేహితుడి ఇంట్లో భారీగా బంగారం, డబ్బు చోరీ..
దీనిపై బీజేపీ స్పందిస్తూ.. ‘‘మోడీ జీ తల్లిని తన ర్యాలీలో తిట్టడానికి తేజస్వీ మళ్లీ సహకరించారు. ఆర్జేడీ కార్యకర్తలు ఎంత దుర్భాషలాడుతున్నారో, తేజస్వీ వారిని అంతగా ప్రోత్సహిస్తున్నాడు. ఆర్జేడీ-కాంగ్రెస్ కార్యక్రమంలో తల్లులు, సోదరీమణుల్ని తిట్టడం వారి నిరాశ తారాస్థాయికి చేరుకోవడం చూపిస్తోంది. బీహార్ తల్లులు, సోదరీమణులు ఈ దుర్భాషలకు ప్రతిస్పందిస్తారు’’ అని పోస్ట్ చేసింది. అయితే, ఈ ఆరోపణలకు మహువా ఆర్జేడీ ఎమ్మెల్యే డాక్టర్ ముఖేష్ రౌషన్ స్పందించారు. ప్రధానిని ఏ ఆర్జేడీ కార్యకర్త దుర్భాషలాడలేదు. ఈ వీడియోలో తేజస్వీ మాట్లాడటం వినవచ్చు. కుట్రలో భాగంగా, ఆర్జేడీ పరువు తీయడానికి బీజేపీ ఈ వీడియోను మార్చారు అని అన్నారు.
అంతకుముందు, దర్భాంగా ఆర్జేడీ ర్యాలీలో వారి కార్యకర్తలు ఇలాగే దూషణలు చేశారు. దీనిపై బీజేపీ ఆర్జేడీ-కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించింది. దీనిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. ఈ దుర్భాషణల ద్వారా తన తల్లినే కాదు కోట్లాది మంది మహిళల్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకుటుంబాల్లో పుట్టిన యువరాజులు పేద తల్లి బాధను, ఆమె కొడుకు పోరాటాన్ని అర్థం చేసుకోరని, బీహార్‌లో అధికారం వారి కుటుంబాలకే చెందుతుందని నమ్ముతున్నారని, కానీ మీరు ఒక పేద తల్లి కొడుకును ఆశీర్వదించి, అతన్ని ప్రధాన సేవకుడిగా చేశారని అన్నారు. ‘‘నా తల్లిని తిట్టినందకు మోడీ ఒకసారి మిమ్మల్ని క్షమించవచ్చు, కానీ బీహార్ భూమి, భారత్ ఎప్పుడూ తల్లిని అవమానించడం సహించదు’’ అని అన్నారు.
गालीबाज आरजेडी – तेजस्वी की माई-बहिन गालीबाज योजना
तेजस्वी ने अपनी रैली में फिर से मोदी जी की स्वर्गीय माता जी को गाली दिलवाई। आरजेडी के कार्यकर्ता जितना गाली दे रहे थे तेजस्वी उतना ही उनका हौसला बढ़ा रहे थे।
राजद-कांग्रेस की रैलियों का आजकल एकसूत्री कार्यक्रम चल रहा है-… pic.twitter.com/7SFecPMjbx
— BJP Bihar (@BJP4Bihar) September 20, 2025