H-1B visa: విదేశీ ఉద్యోగులకు ఇచ్చే H-1B వీసాలపై ట్రంప్ సర్కార్ కొత్త నిబంధల్ని తీసుకువచ్చింది. విదేశీ ఉద్యోగుల్ని నియమించుకునే కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వానికి 1,00,000 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. భారత కరెన్సీలో ఇది రూ. 88 లక్షలు. ఈ చర్య భారతీయ టెక్కీలను గణనీయంగా ప్రభావితం చేస్తుంది. H-1B వీసా హోల్డర్లలో దాదాపు 70 శాతం మంది భారతీయులే ఉన్నారు.
Vijay: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకలో ఉన్న తమిళ సమస్యల్ని లెవనెత్తారు. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టిటిఇ) దివంగత చీఫ్ వేలుపిళ్లై ప్రభాకరన్ను ప్రశంసించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన సూత్రధారి అయిన, ప్రభాకరన్పై ప్రశంసించడం సంచలనంగా మారింది. దేశ ప్రజలు శ్రీలంక తమిళుల గొంతుక కావాలని పిలుపునిచ్చారు.
H-1B visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాదారులకు షాక్ ఇచ్చారు. H-1B వీసాల రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కి పెంచాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీలో ఆందోళన పెంచాయి.
Ranchi: జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. నగరంలోని ఇస్లాంనగర్ ప్రాంతంలో తబారక్ లాడ్జ్, హోటల్ పేరుతో నడుస్తోంది. అయితే, ఈ లాడ్జ్ గదుల్లో ఓ యువకుడు మాత్రం నిషేధిత ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నాడు. ఉగ్రవాదులకు బాంబులు అందించేందుకు, గదినే బాంబుల తయారీ కేంద్రంగా మార్చుకున్నాడు.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఓ మహిళా కార్మికురాలిని అదృష్టం వరించింది. ఏకంగా ఆమె 8 వజ్రాలను కనుగొంది. రాష్ట్రంలోని పన్నా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేశంలో వజ్రాలకు పేరుగాంచింది ఈ పన్నా జిల్లా. ఈ ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నాయి. లక్షల రూపాయల విలువ కలిగిన 8 వజ్రాలను కనుగొన్నట్లు శనివారం ఒక అధికారి తెలిపారు.
H-1B visa: H-1B వీసాలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీల్లో భయాన్ని నింపాయి. H-1B వీసాల రుసుమును $100,000 (రూ. 88 లక్షలు)కి పెంచాలని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకస్మికంగా తీసుకున్న చర్యతో, ముఖ్యంగా ఆ దేశంలో ఉంటున్న భారతీయులకు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. దీనికి తోడు సెప్టెంబర్ 21 వరకు మాత్రమే గడువు విధించడంతో అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం మొదలైంది. ప్రకటన వెలువడిన వెంటనే భారతీయ టెక్కీలు విమానాల నుంచి దిగిపోయినట్లు నివేదికలు […]
H-1B visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా వార్షిక రుసుమును భారీగా పెంచాడు. ఈ చర్యల ముఖ్యంగా భారతీయుల టెక్కీలు, ఇతర రంగాల్లో అమెరికాలో పనిచేస్తున్న వారికి పెద్ద దెబ్బగా చెప్పవచ్చు. H-1B visa వీసాల్లో 70 శాతం భారతీయులే ఉన్నారు. ప్రస్తుత వీసా హోల్డర్లతో సహా H-1B ఉద్యోగులు, వారి యజమాని ఉద్యోగికి USD 100,000 వార్షిక రుసుము (రూ. 88 లక్షలకు పైగా) చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుము చెల్లించకపోతే ఆదివారం నుంచి అమెరికా లోకి ప్రవేశం నిరాకరించబడుతుందని…
Operation Sindoor: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’ దెబ్బ గట్టిగానే తాకినట్లు ఉంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా, పీఓకేతో పాటు పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మురిడ్కే లోని లష్కరే తోయిబా, బహవల్పూర్లోని జైషే మహ్మద్ ప్రధానకార్యాలయాలను పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో, పీఓకేతో పాటు భారత సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలను వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Manipur: మణిపూర్లో ఉగ్రవాదులు అస్సాం రైఫిల్స్ సైనికులు ప్రయాణిస్తున్న ట్రక్కుపై మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. నలుగురు గాయపడ్డారు. రాజధాని ఇంఫాల్ శివారులో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన జరిగింది. ఇంఫాల్ ఎయిర్ పోర్టు నుంచి 8 కి.మీ దూరంలో ఉనన నంబోల్ సబల్ లైకై ప్రాంతంలో, ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్ ప్రయాణిస్తున్న పారామిలిటరీ దళాల వాహనంపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పులు జరిపినట్లు సైన్యం కూడా ధ్రువీకరించింది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, లండన్ తొలి ముస్లి్ం మేయర్ సాదిక్ ఖాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూకే పర్యటనలో ఉన్న ట్రంప్, సాదిక్ ఖాన్ ‘‘ప్రపంచంలోనే చెత్త మేయర్లలో ఒకరు’’ అని విమర్శించారు. యూకే రాజధానిలో నేరాలు, వలసల్ని అరికట్టడంతో ఆయన విఫలమయ్యారని అన్నారు. తన గౌరవార్థం యూకే ప్రభుత్వం ఇస్తున్న విందుకు అతడిని ఆహ్వానించవద్దని తానను వ్యక్తిగతంగా కోరినట్లు వెల్లడించారు.