Nari Nari Naduma Murari: సంక్రాంతి 2026కి బ్లాక్‌బస్టర్ ఎండ్.. శర్వానంద్ కెరీర్‌లో మరో మైలురాయి!
- ఎట్టకేలకు హిట్ కొట్టిన శర్వానంద్
- సంక్రాంతి 2026కి నారి నారి నడుమ మురారి హిట్
- సంక్రాంతి సీజన్‌లో శర్వాకు హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో శర్వానంద్ ఎట్టకేలకు హిట్ కొట్టారు. గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న శర్వా.. ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. సంక్రాంతి 2026 సందర్భంగా బుధవారం (జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని.. బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి వసూళ్లు సాధిస్తోంది. మొత్తానికి ‘నారి నారి నడుమ మురారి’ సినిమా శర్వానంద్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది. సంక్రాంతి సీజన్‌లో ఆయనకు ఇది హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌గా (2016 ఎక్స్‌ప్రెస్ రాజా, 2017 శతమానం భవతి) మారింది.
సంక్రాంతి 2026 రేసులో చివరిగా ప్రకటించబడిన, చివరిగా విడుదలైన సినిమా ‘నారి నారి నడుమ మురారి’. విడుదలలో ఆలస్యమైనా.. బాక్సాఫీస్ వద్ద ఫలితం మాత్రం గట్టిగానే వచ్చింది. ఈ చిత్రంలో శర్వానంద్ నటన అద్భుతం. స్టైలిష్ అండ్ క్లాసీ క్యారెక్టర్‌లో ఆయన పూర్తిగా లీనమయ్యారు. శర్వా ఎనర్జీ, కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ టాప్ క్లాస్‌గా నిలిచాయి. చాలా కాలం తర్వాత శర్వానంద్‌ను ఫుల్ ఎనర్జీలో చూసామని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం హిట్ మాత్రమే కాదు.. బ్లాక్‌బస్టర్ అని ఫాన్స్ అంటున్నారు.
Also Read
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
Also Read: Mohammed Siraj Captain: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్!
దర్శకుడు రామ్ అబ్బరాజు సినిమాను వినోదాత్మకంగా మలిచిన తీరు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని కథను నడిపిన విధానం సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది. ఇద్దరు కథానాయికలు సంయుక్త మీనన్, సాక్షి వైద్య మధ్య శర్వానంద్ పాత్రను ఎంగేజింగ్‌గా ప్రెజెంట్ చేయడం కూడా సినిమాకు ప్లస్ అయింది. కామెడీ విషయానికి వస్తే.. నరేష్ వీకే, సత్య కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా నవ్వించింది. ఆసుపత్రి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ఎక్కడా డబుల్ మీనింగ్‌లు లేకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్‌తో కలిసి చూడదగిన ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది. సినిమాలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు మంచి స్పందన వస్తోంది. టెక్నికల్ అంశాల్లోనూ సినిమా మెప్పించింది. ఈ విజయంతో శర్వానంద్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!