Venu Goapl Reddy
Author- NTV Telugu-
DK Shivakumar: “నా పేరుతో శివుడు, ఆయన పేరులో రాముడు”.. బీజేపీపై డీకే శివకుమార్ విమర్శలు..
DK Shivakumar: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుక వేళ కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక జరగనున్న జనవరి 22న ప్రభుత్వ సెలువు దినంగా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఆ రోజు సెలవు ఇచ్చేదడి లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమర్థించారు. -
Nirmala Sitharaman: రామ మందిర ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు నిషేధం.. దేవాలయాల్లో పూజలు, అన్నదానం బ్యాన్..
Nirmala Sitharaman: రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశం సిద్ధమవుతోంది. రేపు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట వేడుకలు జరగబోతున్నాయి. ఇదిలా ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమిళనాడు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రామ మందిర కార్యక్రమాలను తమిళనాడులో బ్యాన్ చేశారంటూ ఆరోపించారు. స్థానిక మీడియ కథనాన్ని ఉటంకిస్తూ.. జనవరి 22న రామ మందిర కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
Mary Millben: రామ మందిర వేడుకకు రాలేకపోవడం బాధగా ఉంది.. అమెరికన్ సింగర్..
Mary Millben: యావత్ దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, రామ భక్తులు రేపు జరగబోయే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ఎదురుచూస్తున్నారు. రేపు అయోధ్యంలో బాల రాముడి ప్రాణప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని ప్రముఖులు, సాధువులు 7000 మంది వరకు హాజరవుతున్నారు. లక్షల్లో ప్రజలు ఈ వేడుకను చూసేందుకు అయోధ్య చేరుకుంటున్నారు. -
Israeli Strike On Syria: సిరియాపై ఇజ్రాయిల్ భీకరదాడి.. ఇరాన్ కీలక అధికారులతో సహా 10 మంది మృతి..
Israeli Strike On Syria: ఇజ్రాయిల్ సిరియాపై విరుచుకుపడింది. రాజధాని డమాస్కస్‌పై దాడులు చేసింది. ఈ దాడుల్లో సిరియాకు చెందిన ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మరియు అతని డిప్యూటీతో పాటు మరో ఇద్దరు గార్డ్స్ సభ్యులు శనివారం మరణించినట్లు ఇరాన్ మీడియా నివేదించింది. రివల్యూషనరీ గార్డ్స్ ఒక ప్రకటనలో.. సిరియా రాజధానిపై జరిగిన స్ట్రైక్స్‌లో నలుగురు సభ్యులు మరణించినట్లు ధృవీకరించింది. -
Ram Mandir: పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి అయోధ్యకు పవిత్ర జలం.. పంపింది ఓ ముస్లిం వ్యక్తి..
Ram Mandir: అయోధ్య రామ మందిర నిర్మాణానికి దేశంలోని పవిత్ర నదులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు నదుల నుంచి కూడా జలాలను సేకరించారు. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి కూడా పవిత్ర జలాలు అయోధ్యకు చేరాయి. అయితే ఈ జలం నేరుగా పాక్ నుంచి భారత్‌కి రాలేదు. -
Rashmika Mandanna deepfake: ఇన్‌స్టాలో ఫాలోవర్లను పెంచుకునేందుకే రష్మిక వీడియో..
Rashmika Mandanna deepfake: నటి రష్మికా మందన్నా డీప్‌ఫేక్ వీడియో గతేడాది సంచలనంగా మారింది. బ్రిటిష్ ఇన్ఫ్లూయెన్సర్ జరా పటేల్ వీడియోకి రష్మికా ముఖాన్ని మార్ఫింగ్ చేసి రూపొందించిన ఈ వీడియోపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీ దుర్వినియోగంపై కేంద్రం మరింత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ వీడియో మార్ఫింగ్‌పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Simultaneous Polls: ప్రతీ 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు.. “వన్ నేషన్-వన్ ఎలక్షన్”పై ఈసీ అంచనా..
Simultaneous Polls: వన్ నేషన్-వన్ ఎలక్షన్ కోసం కేంద్రం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే కొత్త ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (ఈవీఎం) కొనుగోలు చేసేందుకు ప్రతి 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు అవసరమవుతాయని ఎన్నికల సంఘం అంచనా వేసింది. -
Kerala: బీజేపీ నేత హత్యలో దోషులుగా 15 మంది నిషేధిత పీఎఫ్ఐ సభ్యులు..
Kerala: కేరళలో బీజేపీ నేతను హత్య చేసిన కేసులో కోర్టు 15 మందిని దోషులుగా నిర్థారించింది. వీరంతా నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) సభ్యులుగా ఉన్నారు. డిసెంబర్ 2021లో కేరళ అలప్పుజ జిల్లాలో బీజేపీ ఓబీసీ విభాగం నేతను హత్య చేశారు. హత్యలో పీఎఫ్ఐ సభ్యుల ప్రమేయం ఉంది. -
Snoring: గట్టిగా “గురక” పెడుతున్నాడని వ్యక్తి హత్య..
Snoring: బిగ్గరగా "గురక" పెట్టడం అతని ప్రాణాలను తీసింది. ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటున్న వ్యక్తుల మధ్య గురక వివాదం ఒకరి హత్యకు కారణమైంది. ఈ ఘటన అమెరికా పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 55 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకి పాల్పడినందుకు థర్డ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపబడ్డాయి. -
Asaduddin Owaisi: ముస్లింల నుంచి క్రమపద్ధతిలో బాబ్రీ మసీదుని లాక్కున్నారు..
Asaduddin Owaisi: రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక ముందు ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కర్ణాటక కలబురిగిలో మీడియాతోమాట్లాడుతూ.. బాబ్రీ మసీదును ముస్లింల నుంచి ‘‘క్రమపద్ధతి’’లో లాక్కున్నారని అన్నారు. 1992లో బాబ్రీ మసీదును కూల్చివేయకుంటే ఈ రోజు ముస్లింలు ఇలాంటి వాటిని చూడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు.
తాజావార్తలు
-
Speed Post New Rates: తపాలా శాఖ కీలక ప్రకటన.. స్పీడ్ పోస్ట్ సేవలకు కొత్త ధరలు.. లేఖలు, పార్శిల్స్ పై కొత్త నిబంధనలు
-
Vaibhav Sooryavanshi-BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ.. బీసీసీఐకి పెద్ద తలనొప్పి!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Shah Rukh Khan: బాలీవుడ్ చరిత్రను సొంతం చేసుకున్న బాద్షా.. అరుదైన ‘మొఘల్-ఎ-ఆజమ్’ పోస్టర్ల కోసం లక్షలు ఖర్చు!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
ట్రెండింగ్
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్‌మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!