MG Astor Blackstorm: ఎంజీ ఆస్టర్ నుంచి బ్లాక్ ఎడిషన్.. ధర ఎంతంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MG Astor Blackstorm: పండగ సీజన్ వస్తుండటంతో అన్ని కార్ కంపెనీలు తమ కార్లను లాంచ్ చేస్తున్నాయి. కొత్త కొత్త ఎడిషన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. మోరిస్ గారేజ్(ఎంజీ) కూడా కొత్త కారుతో మార్కెట్ లోకి తీసుకువస్తోంది. ఎంజీ తన కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్ ఆస్టర్ ని న్యూ అవతార్ లో తీసుకురాబోతోంది. బ్లాక్ ఎడిషన్ లో వస్తోంది. “ఎంజీ ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్” పేరుతో ఈ కారును తీసుకువస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న హ్యుందాయ్ క్రేటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, ఫోక్స్ వ్యాగన్ టైగున్ కి ఎంజీ ఆస్టర్ పోటీ ఇవ్వనుంది.
ధర విషయానికి వస్తే ఎంజీ ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్ ధర రూ. 14.48 లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉందని సంస్థ ప్రకటించింది. రాబోయే పండగ సీజన్ ను లక్ష్యంగా చేసుకుని కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ని ఎంజీ తీసుకువస్తోంది. 2021లో ఎంజీ ఆస్టర్ ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది. మిడ్ సైజ్ ఎస్‌యూవీ కార్లలో పోటీలో ఉంది.
Also Read
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
- Hero Glamour X 125: హీరో గ్లామర్ ఎక్స్ 125 కొత్త అప్డేట్తో లాంచ్.. రైడింగ్ మోడ్లతో పాటు క్రూయిజ్ కంట్రోల్, ABS!
Read Also: One Nation-One Election: రామ్ నాథ్ కోవింద్‌తో అమిత్ షా సమావేశం
ఎంజీ ఆస్టర్ బ్లాక్ ఎడిషన్ 5 స్పీడ్ ఎంటీ, సీవీటీతో 1.5-లీటర్ VTi-TECH పెట్రోల్ ఇంజన్ (110PS మరియు 144Nm) కలిగి ఉంది. 2లిమిటెడ్ ఎడిషన్ లో పాత ఆస్టర్ లో ఉన్నటువంటి 1.4 లీటర్ 220 టర్బో ఇంజన్ మిస్ అవుతుంది. బ్లాక్ స్టార్మ్ ఎంటీ – రూ. 14.48 లక్షలకు, బ్లాక్ స్టార్మ్ సీవీటీ రూ. 15.77(ఎక్స్ షోరూం) ధరను కలిగి ఉంది. అట్రాక్టివ్ బ్లాక్ కలర్ తో కొత్త ఎంజీ ఆస్టర్ స్టైలిష్ గా ఉంది. బ్లాక్-అవుట్ హనీకోంబ్ గ్రిల్, రెడ్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌లతో కూడిన అల్లాయ్ వీల్స్, బ్లాక్-ఫినిష్డ్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్-ఫినిష్ రూఫ్ రెయిల్‌లు, గ్లోసీ బ్లాక్ డోర్ గార్నిష్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో కొత్త ఎడిషన్ ఉంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!