Pakistan: ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది పాకిస్తాన్‌లో ఖతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న ఇండియా మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదులంతా ఒక్కొక్కరుగా హతమవుతున్నారు. తాజాగా పాకిస్తాన్ లోని ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలో ఉంటున్న లష్కర్ టాప్ కమాండర్ రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాసిం హత్యకు గురయ్యాడు. పాకిస్తాన్ లో జరుగుతున్న ఉగ్రవాదుల హత్యల్లో ఇది నాల్గొవది. తాజాగా హతమైన ఉగ్రవాది జనవరి 1న జరిగిన ధంగ్రీ ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు. ఈ ఏడాది జనవరి 1న హిందూమెజారిటీ గ్రామమైన ధంగ్రీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న క్రమంలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించగా.. 13 మంది గాయపడ్డారు.
Read Also: Ration Card: రేషన్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఈ కేవైసీ అప్డేట్ చేయకుంటే సరుకులు అందవు
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
శుక్రవారం రోజున పీఓకేలో తెల్లవారుజామున ప్రార్థనల సమయంలో రావల్ కోట్ ప్రాంతంలోని ఆల్-ఖుదుస్ మసీదులో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిగి అబూఖాసింని హత్య చేశారు. జమ్మూ ప్రాంతానికి చెందిన అబూఖాసిం 1999లో సరిహద్దులు దాటి పాకిస్తాన్ పరారయ్యాడు. పూంచ్, రాజౌరి జిల్లాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇతను ఎక్కువగా పీఓకేలోని మురిడ్నేలోని లష్కరేతోయిబా బేస్ క్యాంపు నుంచి పనిచేస్తున్నాడు. ఇటీవలే రావల్ కోట్ కు మారినట్లు తెలుస్తోంది. లష్కర్ చీఫ్ కమాండర్ సజ్జాద్ జాత్ కు కీలక సన్నిహితుడిగా ఉన్నాడు. ఈ ఏడాది పాకిస్తాన్ లో హత్య చేయబడిని ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో అబూ ఖాసీం నాలుగో వ్యక్తి.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!