Pakistan: భారత్‌ని చూసి పాక్ అసూయ.. చివరకు సౌదీ ప్రిన్స్ కూడా పట్టించుకోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ రగిలిపోతుంది. భారత్ ఎదుగుదలను చూసి అక్కడి ప్రజలు అసూయ వ్యక్తం చేస్తున్నారు. ఇరు దేశాలు కూడా ఒకేసారి స్వాతంత్య్రం పొందినా కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యం వర్థిల్లుతుంటే.. పాకిస్తాన్ లో మాత్రం ప్రజాస్వామ్యం మాటున సైన్యం రాజ్యమేలుతోంది. చివరకు 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ కూడా ఆర్థికంగా ఎంతో ఎదిగింది. పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదం, ఆర్థిక కష్టాలు, రాజకీయ అస్థిరత ఉంది. చివరకు ప్రజలకు నిత్యావసరాలు, కరెంట్, గ్యాస్ అందుబాటులో ఉండటం లేదు. ఒక వేళ ఉన్నా కూడా ధరలు చుక్కలను అంటుతోంది.
తాజాగా జీ20 సమావేశాలను ఇండియా నిర్వహించింది. ఈ సమావేశాలకు సంబంధించిన వార్తలు పాకిస్తాన్ మీడియాలో విస్తృతంగా కవరయ్యాయి. ప్రపంచ దేశాధినేతలు భారత్ కు తరలివస్తుండటంపైస అక్కడి ప్రజలు కామెంట్ చేస్తున్నారు. పాకిస్తాన్ కు చెందిన యూట్యూబ్ ఛానెళ్లు ఈ సమావేశాల గురించి తమ ప్రజల మనోభావాలను తెలుసుకున్నాయి. పాకిస్తాన్, భారత్ తో పోలిస్తే కొన్నేళ్లు వెనకబడి ఉందని చెబుతూనే, కొంతమంది భారత్ పై తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
Read Also: Pakistan: ఇండియా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది పాకిస్తాన్‌లో ఖతం
ఈ జీ20 సమావేశంలో భారత్-మిడిల్ ఈస్ట్-యూరోపియన్ యూనియన్ కారిడార్ రూపంలో పాకిస్తాన్ కు గట్టి ఎదురుదెబ్బ తాకింది. చైనా నిర్మిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ)కి ప్రత్యామ్నాయంగా ఈ ఆర్థిక కారిడార్ ను అమెరికా, భారత్, సౌదీ అరేబియా, యూఏఈ, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ దేశాధినేతలు సంయుక్తంగా ప్రకటించారు. ఈ కారిడార్ లో పోర్ట్-రైల్ ప్రాజెక్టులు ఉన్నాయి. భారత్ ను అరబ్, గల్ఫ్ దేశాలతో నౌకామార్గం ద్వారా అనసంధానించడం, అరబ్, గల్ఫ్ ప్రాంతాలను యూరోపియన్ దేశాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానించడం ఈ ప్రాజెక్టులో భాగం. భారత్ ఇలా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో దూసుకుపోతుంటే.. పాకిస్తాన్ మాత్రం చైనా నిర్మిస్తున్ సీపెక్, గ్వాదర్ పోర్టులతో ఆర్థికంగా నిండా మునిగిపోతుంది.
మరోవైపు తన మిత్రదేశం అని పాకిస్తాన్ పదేపదే చెబుతున్న సౌదీ అరేబియా కూడా ఆ దేశాన్ని పట్టించుకోవడం లేదు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్) జీ20 సమావేశాల కోసం నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు. నిజానికి పాకిస్తాన్ ఇస్లామాబాద్ వెళ్లి రావాల్సిన ఎంబీఎస్ అక్కడ ఆగకుండా నేరుగా భారత్ రావడం, ప్రధాని మోడీని ఆత్మీయంగా కౌగిలించుకోవడం పాకిస్తాన్ తట్టుకోలేకపోతోంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టేంక్కేందుకు పాక్, సౌదీ నుంచి 25 బిలియన్ డాలర్లు పెట్టుబడులుగా వస్తాయని భావించింది. ఈ డీల్ గురించి ఇస్లామాబాద్ వెళ్లాల్సి ఉన్నా సౌదీ ప్రిన్స్ అక్కడికి వెళ్లలేదు. ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ పౌరులు ట్విట్టర్ వేదికగా భారత్ ప్రతిష్ట పెరుగుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. భారత్ ఎదుగుదలను చూసి ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానని, పాకిస్తాన్ కి మెరుగైన నాయకత్వం, జవాబుదారీతనం కావాలని ఒక నెటిజన్ తన ఎక్స్(ట్విట్టర్)లో రాశాడు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!