Russia: న్యూఢిల్లీ నిర్వహించిన జీ20 సమావేశం ‘మైలురాయి’గా మిగిలిపోతుందని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ అభివర్ణించారు. G20 అధ్యక్షుడిగా భారతదేశం తొలిసారిగా గ్లోబల్ సౌత్ స్థానాన్ని ఏకీకృతం చేసిందని ఆయన అన్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎజెండా కాకుండా భారత్ వ్యవహరించిందని చెప్పారు. ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణపై ఆయన స్పందించారు.
ప్రతీ ఒక్కరూ శాంతిని కోరుకుంటారని.. సుమారు 18 నెలల క్రితం ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ఒప్పందంపై సంతకం చేయడానికి వ్యవహరించామని, ఆ తర్వాత ఆంగ్లో-సాక్సన్లు జెలన్ స్కీ సంతకం చేయవద్దని ఆదేశించారని, వారు మేము మరి కొన్నింటిని ఒప్పుకోవాలని భావించారని ఆయన అన్నారు. ఇటీవల పుతిన్ చర్చల గురించి పట్టించుకోవడం లేదని చెప్పారని.. అయితే వాస్తవనాలనను పరిగణలోకి తీసుకోవాలని, నాటో దూకుడు విధానం వల్ల దశాబ్ధాలుగా పేరుకుపోయిన సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని లావ్రోవ్ అన్నారు.
Read Also: IND vs PAK Live Updates: భారత్-పాక్ మ్యాచ్.. మ్యాచ్‌కు అడ్డంకిగా మారిన వరుణుడు
ప్రస్తుతం ఉక్రెనియన్ అధికారులు రష్యాను నాశనం చేస్తామని బెదిరిస్తున్నారని చెప్పారు. రష్యా తన షరతులు నెరవేరితేనే బ్లాక్ సీ ధాన్యం ఒప్పందానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఐక్యరాజ్యసమితి, టర్కీ మధ్యవర్తిత్వంతో కుదరిని ఈ ఒప్పందాన్ని జూలై నెలలో రష్యా వదులుకుంది. ఉక్రెయిన్ నుంచి ఎరువులు, ధాన్యం ఇతర దేశాలకు ఎగుమతి అయ్యేందుకు ఈ ఒప్పందాన్ని ఏడాకి క్రితం రష్యా ఒప్పుకుంది. అయితే ఆ తరువాత దీన్నుంచి తప్పుకుంది.