Rajasthan: రాజస్థాన్‌కి చెందిన ఓ మహిళ అసలు విషయం తెలిస్తే తన భర్త ఎక్కడ వదిలేస్తాడో అని ఏకంగా సామూహికి అత్యాచారానికి గురైనట్లు నాటకం ఆడింది. భిల్వారాలోని ఓ వివాహిత తానను అపహరించి, గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు ఇదంతా వట్టిదే అని మహిళ నకిలీ రేప్ స్టోరీని అల్లిందని తేల్చారు.
వివరాల్లోకి వెళ్తే 25 ఏళ్ల వివాహిత ముందుగా తనను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, శనివారం తనను పాడుబడిన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశారని, కొట్టారని పేర్కొంది. తన బట్టలు కూడా ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులకు అసలు విషయం తెలిసి కంగుతిన్నారు. మహిళ తన ఇష్టప్రకారమే ఇద్దరు వ్యక్తులతో కలిసి వెళ్లినట్లు తేలింది. ఆదివారం పోలీసుల మాట్లాడుతూ.. మహిళ ఇష్టపూర్వకంగానే ఇద్దరు పురుషులతో వెళ్లిందని, రాత్రి గడపాలని ఇద్దరు పట్టుబట్టడంతో మహిళ వారితోనే ఉందని చెప్పారు.
Read Also: IND vs PAK: పాకిస్థాన్‌తో మ్యాచ్.. భారత తుది జట్టులో ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ ఉంటారా?
ముందుగా ఇంటికి తిరిగి రావాలనుకున్నా, ఇద్దరు పురుషులు బలవంతం చేయడంతో అక్కడే ఉండిపోయింది. అయితే ఈ విషయం తెలిస్తే తన భర్త ఎక్కడ వదిలేస్తాడో అనే భయంతో బట్టలు విప్పేసి అత్యాచారం జరిగినట్లు కలరింగ్ ఇస్తూ బాటసారులను సాయం కోరింది. ఇంటికి వచ్చి తాను అత్యాచారానికి గురైనట్లు భర్తకు తెలిపిందని పోలీసులు వెల్లడించారు.
నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం మహిళ వారితో మాట్లాడిందని, డబ్బుల కోసం వారిద్దరిని కలిసేందుకు అంగీకరించిందని ఫోన్ కాల్ రికార్డుల ద్వారా వెల్లడయ్యాయి. సదరు మహిళ, అమ్లీ రోడ్ లోని పాడుబడిన ఇంట్లో ఛోటూ సర్గరా, గిర్దారిలతో రాత్రంతా గడిపింది. ఇష్టపూర్వకంగానే ఇద్దరు వ్యక్తులతో శృంగారంలో చేసినట్లు పోలీసులు తేల్చారు. ఒడిశాకు చెందిన ఈ మహిళకు భిల్వారాకు చెందిన 50 ఏళ్ల వికలాంగుడైన వ్యక్తితో వివాహం జరిగినట్లు పోలీసులు తెలిపారు.