Nitish Kumar: బీజేపీని ఓడించేందుకు 2024లో కాంగ్రెస్, జేడీయూ, ఆప్, టీఎంసీ, ఆర్జేడీ వంటి పార్టీలు కూటమి కట్టాయి. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రకటించలేదు. ప్రధాని పదవిపై చాలా మంది నేతల గురి ఉంది. మమతాబెనర్జీ, నితీష్ కుమార్, రాహుల్ గాంధీ ఇలా పలువురు నాయకులు ప్రధాని పదవికి అర్హులని ఆయా పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నితీష్ కుమార్ ప్రధాని అవుతారని ఆయన పార్టీ జేడీయూకు చెందిన నేత కీలక వ్యాఖ్యలు చేశారు.
Khalistan: కెనడా, పాకిస్తాన్, యూకే, అమెరికాల్లో ఉంటూ ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడమే కాకుండా, పంజాబ్ రాష్ట్రంలో నేరాలకు పాల్పడుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదుల అణిచివేత ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. కెనడా-ఇండియాల మధ్య ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య దౌత్య వివాదానికి కారణమైంది, ఇదే సమయంలో దేశం నుంచి పారిపోయిన ఖలిస్తానీ ఉగ్రవాదులు, వేర్పాటువాదులపై భారత ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది.
PM Modi: దీనిని చరిత్ర గుర్తుంచుకుంటుందని అన్నారు. మన్ కీ బాత్ లో మాట్లాడిన ప్రధాని పురాతన కాలంలో భారత్ వాణిజ్య శక్తిగా ఉన్న సమయంలోని ‘సిల్క్ రూట్’ వాణిజ్య కారిడార్ని గుర్తు చేశారు. ఇండియానే ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ ని ఇటీవల జరిగిన జీ20 సదస్సులో సూచించిందని ప్రధాని అన్నారు. చంద్రయాన్-3 విజయం తర్వాత జరిగిన జీ20 సదస్సు ప్రతీ భారతీయుడి ఆనందాన్ని రెట్టింపు చేసిందని ఆయన పేర్కొన్నారు.
JDS: కర్ణాటకలో పాత మిత్రుడితో మళ్లీ జేడీఎస్ జతకట్టింది. బీజేపీ, జేడీఎస్ మధ్య పొత్తు కుదరింది. రెండు రోజుల క్రితం జనతాదళ్ సెక్యులర్(జేడీఎస్), బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరింది. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, అతని కుమారుడు నిఖిల్ గౌడ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఎన్డీయేలో చేరారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జేడీఎస్, బీజేపీల మధ్య పొత్తు చిగురించింది. రెండు పార్టీలు కలిసికట్టుగా 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి.
Hardeep Singh Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తలకు దారి తీసింది. కెనడాలోని సర్రేలో జూన్ నెలలో నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. అయితే ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం, భారత్ దౌత్యవేత్తను కెనడా బహిష్కరించడం ఒక్కసారిగా సమస్య తీవ్రతను పెంచింది. ఇటు భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను ఇండియా వదిలి వెళ్లాలని ఆదేశించింది.
Rahul Gandhi: మరికొన్ని రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల ముందు ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కీలకంగా మారాయి. ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈ ఎన్నికలు ఉపయోగపడనున్నాయి. ఈ ఏడాది చివర్లలో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Sharad Pawar: ఎన్సీపీ నేత శరద్ పవార్, బిలియనీర్ గౌతమ్ అదానీని కలిశారు. ఆయన ఇంటితో పాటు కార్యాలయాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం అహ్మదాబాద్ లో అదానీని కలిశారు. ఇద్దరూ కలిసి అహ్మదాబాద్ లో భారతదేశపు తొలి లాక్టోఫెర్రిన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ‘‘ భారతదేశం యొక్క మొట్టమొదటి లాక్టోఫెర్రిన్ ప్లాంట్ ఎక్స్మ్పవర్ను గుజరాత్లోని చాచర్వాడిలోని వస్నాలో మిస్టర్ గౌతమ్ అదానీతో కలిసి ప్రారంభించడం ఒక విశేషం’’ అని పవార్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
India-Canada: ఇండియా-కెనడాల మధ్య వివాదంపై పాకిస్తాన్ మీడియా పండగ చేసుకుంటోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ మాత్రం కెనడా, భారత్ బంధం వీక్ కావడంపై హ్యాపీగా ఫీల్ అవుతోంది.
One Nation, One Election: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కోసం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిండ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ ఈ రోజు తొలిసారిగా సమావేశమైంది. దేశంలో ఒకే సమయంలో పార్లమెంట్, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించాలని కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కోవింద్ అధ్యక్షతన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది
Nigeria: ఆఫ్రికా దేశం నైజీరియాలో బందిపోట్లు రెచ్చిపోయారు. గుంపులుగా వచ్చి యూనివర్సిటీలో ఉన్న 24 మంది మహిళా విద్యార్థినులతో సహా 30 మందిని కిడ్నాప్ చేశారు. ఆయుధాలతో వచ్చిన వీరంతా లేడీస్ హాస్టళ్లలో నివసిస్తున్న వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వాయువ్య నైజీరియాలోని జంఫారా రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఈ ఘటన జరిగింది. ఆ రాష్ట్ర రాజధాని గుసౌ వెలుపల ఉన్న ఫెడరల్ యూనివర్సిటీతో ఈ ఘటన జరిగింది.