iPhone 15: దేశంలో ఐఫోన్ 15 క్రేజ్ మామూలుగా లేదు. ముంబై, ఢిల్లీలోని ఆపిల్ స్టోర్ల ముందు జనాలు బారులు తీరారు. ఇటీవల ఆపిల్ సంస్థ ఐఫోన్ 15ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ ను సొంతం చేసుకోవడానికి ఐఫోన్ లవర్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి ఐఫోన్ 15 దక్కించుకునేందుకు ఏకంగా 17 గంటల పాటు క్యూలో నిల్చున్నాడు.
Land-For-Jobs Case: ల్యాండ్ ఫర్ జాబ్ కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, వీరి కుమారుడు, ప్రస్తుత బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ లకు ఢిల్లీ కోర్టు శుక్రవారం సమన్లు జారీ చేసింది. ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ వారిపై దాఖలైన ఛార్జిషీట్ ని పరిగణలోకి తీసుకున్నారు. అవినీతి, నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీతో సహా పలు నేరాలను ప్రాథమిక సాక్ష్యాలు చూపించాయని అన్నారు.
అయితే ఇస్రో ఈ రోజు ల్యాండర్, రోవర్ తో సంబంధాలను పునరుద్ధరించేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే ఇంత వరకు గ్రౌండ్ స్టేషన్ తో సంబంధాలు ఎస్టాబ్లిష్ కాలేదని ఇస్రో తెలిపింది. సంబంధాలు ఏర్పరుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తామని ప్రకటించింది.
Amazon Prime: ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు పంథాను మార్చాయి. దీంతో పాటు యాడ్స్ ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని అనుకుంటున్నాయి. తక్కువ ధరకు ఆఫర్లను అందించి సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం అమెజాన్ ఫ్రైమ్ వీడియోస్ కూడా యాడ్ సపోర్టెడ్ ఆఫర్లను తీసుకురాబోతోంది. వచ్చే ఏడాది ఈ ఆఫర్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా యూకే, యూఎస్ఏ, జర్మనీ, కెనడాలో 2024లో ప్రారంభిస్తామని అమెజాన్ తెలిపింది.
Tata Punch EV: ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్ లో ఇండియాలోనే టాటా తోపుగా ఉంది. టాటా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌ని పరిశీలిస్తే దీని దరిదాపుల్లో కూడా ఇతర కార్లు లేవు. ఇప్పటికే టాటా నుంచి టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ కార్లు ఉన్నాయి. ఇండియాలోనే నెక్సాన్ ఈవీ బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారుగా ఉంది. ఇప్పటికే టాటాలో హ్యచ్ బ్యాక్ సెగ్మెంట్ లో టియాగో ఈవీ, సెడాన్ లో టిగోర్ ఈవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీలో నెక్సాన్ ఈవీ ఉంది. అయితే ఇప్పుడు…
Kamal Haasan: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బీజేపీతో పాటు పలు హిందూ సంఘాలు ఈ
Krishna Janmabhoomi: ఉత్తర్ ప్రదేశ్ మథుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదం నడుస్తోంది. ఈ ప్రాంతాన్ని సర్వే చేయాలిన నమోదైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ వివాదంపై దాదాపు 10 దావాలు దాఖలైనట్లు అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన కాలేజీ విద్యార్థినిని ఓ యువకుడు దారుణంగా చంపాడు. తుపాకీతో కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఘటన లక్నోలో జరిగింది.
Bengaluru: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, యువతితో అసహజ లైంగిక సంబంధం పెట్టుకోవడంమే కాకుండా, పెళ్లి కోసమ మతం మారాలని ఒత్తిడి చేస్తున్న ఓ వ్యక్తిని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల మొగిల్ అష్రఫ్ బేగ్ అనే వ్యక్తి బెంగళూర్ లోని టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి బాధిత యువతితో 2018 నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. సదరు యువతి కూడా బెంగళూర్ లోనే ఓ టెక్…
MotoGP: మోటార్ సైకిల్ రోడ్ రేసింగ్ ఈవెంట్లకు ప్రసిద్ధి చెందిన MotoGP భారత మ్యాపును తప్పగా చూపింది. ఉత్తర్ ప్రదేశ్ గ్రేటర్ నోయిడా బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో జరుగుతున్న ఇండియన్ ఆయిల్ గ్రాండ్ ఫ్రీక్స్ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారంలో భారత మ్యాపును తప్పుగా చూపింది. దీంతో MotoGP చేసిన తప్పును నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఎత్తి చూపారు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.