Sharad Pawar: అదానీని కలిసిన శరద్ పవార్.. రాహుల్ గాంధీని పట్టించుకోవడం లేదని బీజేపీ ఎద్దేవా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: ఎన్సీపీ నేత శరద్ పవార్, బిలియనీర్ గౌతమ్ అదానీని కలిశారు. ఆయన ఇంటితో పాటు కార్యాలయాన్ని సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శనివారం అహ్మదాబాద్ లో అదానీని కలిశారు. ఇద్దరూ కలిసి అహ్మదాబాద్ లో భారతదేశపు తొలి లాక్టోఫెర్రిన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ‘‘ భారతదేశం యొక్క మొట్టమొదటి లాక్టోఫెర్రిన్ ప్లాంట్ ఎక్స్‌మ్‌పవర్‌ను గుజరాత్‌లోని చాచర్‌వాడిలోని వస్నాలో మిస్టర్ గౌతమ్ అదానీతో కలిసి ప్రారంభించడం ఒక విశేషం’’ అని పవార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Read Also: India-Canada: “మొస్సాద్” నుంచి “రా” నేర్చుకుంది.. కెనడా వివాదంలో ఇజ్రాయిల్‌పై పాక్ మీడియా నిందలు..
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో కూడా శరద్ పవార్ని ముంబైలోని ఆయన నివాసంలో గౌతమ్ అదానీ కలిశారు. ఇరువురు రెండు గంటల పాటు పలు విషయాలపై చర్చించారు. ఆ తరువాత అదానీపై వచ్చిన ఇండెన్‌బర్గ్ రిపోర్టు సమయంలో కూడా పవార్, అదానీకి అండగా నిలిచారు. పవార్ తన ఆత్మకథ ‘లోక్ మేజ్ సంగటి’లో అదానీపై ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉంటే పవార్-అదానీ కలయిక కాంగ్రెస్ పై విమర్శలకు దారి తీసింది. కాంగ్రెస్, రాహుల్ గాంధీని ఉద్దేశించి బీజేపీ ఎద్దేవా చేస్తోంది. 2024లో బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కట్టిన ఇండియా కూటమిలో కాంగ్రెస్ తో పాటు శరద్ పవార్ ఎన్సీపీ కూడా ఉంది. మరోవైపు అదానీపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ-పవార్ ట్వీట్ చేసిన ఫోటోలను ఉద్దేశిస్తూ.. రాహుల్ గాంధీ వినాలనుకుంటే ఈ ఫోటోలు వెయ్యి మాటలు చెబుతున్నాయని అన్నారు. ఇండియా కూటమిలో రాహుల్ గాంధీని ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని అన్నారు.
I just hope that Sharad Pawar ji won’t be abused by likes of Alka Lamba again merely because nobody in INDI Alliance takes @RahulGandhi or his utterances seriously. This picture speaks a thousand words provided Rahul Gandhi is willing to listen 👂 pic.twitter.com/UYFA3EnoIr
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) September 23, 2023
తాజావార్తలు
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?