Australia: రెండో ప్రపంచ యుద్దం తరువాత చైనా అతిపెద్ద సాంప్రదాయిక సైనిక సమీకరణను ఏర్పాటు చేస్తోందని ఆస్ట్రేలియన్ రాయబారి మంగళవారం అన్నారు. అయితే ఈ సైనికీకరణ వ్యూహాత్మక ఉద్దేశ్యాన్ని స్పష్టం చేయడకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్లిష్టకాలంలో చైనాతో ఆస్ట్రేలియా సంబంధాన్ని స్థిరీకరించకోవడానికి ప్రయత్నిస్తోందని తెలిపారు.
S Jaishankar: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య అగ్గిరాజేసిన వేళ భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పరోక్షంగా కెనడాకు గడ్డి పెట్టారు. ఆ దేశాన్ని ఉద్దేశించేలా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ సౌలభ్యం కోసం ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసపై ప్రతిస్పందన ఉండకూడదని ఆయన అన్నారు.
US presidential race: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. 2024లో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి, ఈ నేపథ్యంలో అక్కడి ప్రెసిడెంట్ రేసు మొదలైంది. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల్లో అధ్యక్ష బరిలో నిలిచేందుకు పలువురు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీలో ఈ పోటీ ఎక్కువగా ఉంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటు ఇండో అమెరికన్లు వివేక్ రామస్వామి, నిక్కీ హెలీ లాంటి వారు పోటీలో ఉన్నారు.
Afghanistan: తాలిబాన్ చట్టాలు, మహిళ హక్కుల ఉల్లంఘన, నిరుద్యోగం, ఉగ్రవాదం ఇలా పలు రకాల సమస్యల్లో చిక్కుకుంది ఆఫ్ఘనిస్తాన్. అయితే ఒక్క విషయంలో మాత్రం ప్రపంచంలో టాప్ స్థానంలో నిలిచింది. బ్లూమ్బర్గ్ డేటా ప్రకారం.. ఈ త్రైమాసికంలోనే ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ప్రపంచంలోనే అత్యుత్తమ కరెన్సీగా అవతరించింది. ‘బెస్ట్ ఫెర్ఫామింగ్ కరెన్సీ’గా నిలిచింది. ఈ కాలంలో ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ ఆఫ్ఘని విలువ 9 శాతం పెరుగుదల కనిపించింది. మానవతా సాయంగా ఇతర దేశాలు బిలియన్ డాలర్లు సాయం చేయడం, ఆసియాలోని పొరుగు దేశలతో వాణిజ్యాన్ని ఆఫ్ఘనిస్తాన్…
RBI: నిబంధనలను పాటించనుందకు ఎస్బీఐ, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సింద్ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఫెనాల్టీని విధించినట్లు సోమవారం తెలిపింది. ‘లోన్స్ అండ్ అడ్వాన్సెస్-చట్టబద్దమైన ఇతర పరిమితులను ఉల్లంఘించినందుకు, ఇంట్రా- గ్రూప్ లావాదేవీలకు సంబంధించిన గైడ్ లైన్స్ ని పాటించనందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై రూ. 1.3 కోట్ల జరిమానా విధించింది.
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా మధ్య సంబంధాలను దెబ్బతీసింది. ఎప్పుడూ లేనంతగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగువస్థాయికి చేరాయి. అయితే ఒక్క నిజ్జరే కాదు చాలా మంది ఖలిస్తానీ వేర్పాటువాదులు, ఉగ్రవాదులు కెనడాలో తలదాచుకుంటూ భారతదేశంపై విద్వేషాన్ని చిమ్ముతున్నారు. సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్, ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఏకంగా భారత దేశాన్ని విడగొట్టాలనే కుట్రకు పాల్పడినట్లు మన నిఘా ఏజెన్సీలు చెబుతున్నాయి.
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో గత వారం అమెరికా రాయబారి పర్యటించారు. ఇప్పుడు ఇదే వివాదానికి కారణమైంది. పాకిస్తాన్ దేశంలో అమెరికా రాయబారిగా ఉన్న డోనాల్డ్ బ్లోమ్ పర్యటించారు. గిల్గిత్ బాల్టిస్తాన్ లో యూఎస్ బృందం పర్యటించడాన్ని భారత్ తప్పుపట్టింది.
India-Canada: భారత్ పై కెనడా అనుసరిస్తున్న వైఖరిపై, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలపై భారత్ పొరగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ స్పందించాయి. ఆధారాలు లేకుండా భారత్ పై ఆరోపణలు చేసిన జస్టిన్ ట్రూడో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా పార్లమెంట్ లో మాట్లాడిన ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో, ఇందులో భారత ప్రమేయం ఉందంటూ ఆరోపించారు.
Armenia: ఆర్మేనియా, అజర్ బైజాన్ మధ్య తీవ్ర ఉద్రికత్త నడుస్తోంది. ఈ రెండు దేశాల మధ్య నగర్నో-కారాబఖ్ ప్రాంతం విదాస్పదంగా మారింది. ఈ ప్రాంతంలోని ఆర్మేనియన్లపై అజర్ బైజాన్ దాడులు చేస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తరలివెళ్తున్న ఆర్మేనియన్లు భారీ ప్రమాదం బారిన పడ్డారు. గ్యాస్ స్టేషన్ వద్ద భారీ ప్రమాదం సంభవించడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది గాయపడ్డారు.
Hardeep Singh Nijjar: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై ఇండియా-కెనడాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఈ హత్యకు భారత ఏజెంట్లే కారణమని అమెరికా నిందిస్తుంది. ఇదిలా ఉంటే ఈ హత్యకు సంబంధించి తాజగా ఓ సీసీటీవీ వీడియో బయటపడింది. జూన్ నెలలో కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలోని గురుద్వారా వెలుపల హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇదంతా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది.