Pakistan: రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం ఇలా పలు సమస్యలు దాయాది దేశం పాకిస్తాన్ ను పట్టిపీడిస్తున్నాయి. మరోవైపు ఆ దేశంలో పేదరికం పెరుగుతున్నట్లు ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక చెబుతోంది. ఏకంగా 9.5 కోట్ల మంది ప్రజలు పేదరికంలో బతుకీడుస్తున్నారు. పాకిస్తాన్ లో గతేడాది పేదరికం 34.2 శాతం ఉంటే ఈ ఏడాది 39.4 శాతానికి పెరిగింది. 1.25 కోట్ల ప్రజల రోజూ వారి ఆదాయం 3.65 డాలర్ల కన్నా తక్కువగా ఉందని వరల్డ్ బ్యాంక్ చెప్పింది.
Cauvery row: కావేరీ నీటి వివాదం కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తమిళనాడుకు ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కావేరీ నీటిని విడుదల చేయడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు తప్పుపడుతున్నారు. నీటి విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 300కు పైగా సంస్థలు మంగళవారం బెంగళూర్ బంద్ కి పిలుపునిచ్చాయి. ఇదిలా ఉంటే మరోవైపు మాండ్యా జిల్లాలో రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. మరికొన్ని సంఘాలు బందుకు పిలుపునిచ్చే యోచనలో ఉన్నాయి.
Delhi University elections: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి విభాగమైన ‘అఖిల భారీతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)’ సత్తా చాటాంది. కీలక స్థానాలను గెలుచుకుంది. శనివారం సాయంత్రం ఓట్ల లెక్కింపు ముగియగా.. నాలుగు సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్లో మూడింటిని ఏబీవీపీ కైవసం చేసుకుంది. కేవలం ఒక సీటును ఎన్ఎస్యూఐ గెలుచుకుంది. అధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ పోస్టులను ఏబీవీపీ కైవసం చేసుకుంది.
Udhayanidhi Stalin: కమల్ హాసన్ పార్టీ ‘మక్కల్ నీది మయ్యం’తో డీఎంకే పొత్తుపై ఆ రాష్ట్ర మంత్రి, సీఎం కుమారుడు ఉదయనిధి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే డీఎంకే నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. పొత్తుపై మాట్లాడుతూ..
MK Stalin: డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. తాజా మరో కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. అవయవ దానం చేసిన దాతలకు ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు.
Nikki Haley: అమెరికా అధ్యక్ష బరిలో ఉండేందుకు ఇండో - అమెరికన్ నిక్కీ హేలీ రిపబ్లికన్ పార్టీ తరుపున ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ తరుపున వివేక్ రామస్వామి, డొనాల్డ్ ట్రంప్ తరువాత రెండోస్థానంలో ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నిక్కీ హేలీ చైనాను ఉద్దేశించి కీలక హెచ్చరికలు చేశారు. న్యూ హాంప్ షైర్ లో జరిగిన ఆర్థిక వ్యవస్థపై మేజర్ పాలసీపై ఆమె మాట్లాడారు.
Vande Bharat Express: భారత రైల్వేలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ సెమీ హైస్పీడు రైళ్ల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. రేపు ప్రధాని నరేంద్రమోడీ 11 రాష్ట్రాలకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు.
Singham: పోలీస్ వ్యవస్థను ఉద్దేశించి బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సింగం’ వంటి సినిమాల్లో చూపించిన విధంగా న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా సత్వర న్యాయం అందించే హీరో పోలీసు సమాజానికి హానికరమైన సందేశాన్ని పంపుతున్నాడని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ అన్నారు. శుక్రవారం ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ వార్షికోత్సవం, పోలీసు సంస్కరణ దినోత్సవాన్న పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూపై కేంద్రం యాక్షన్ మొదలు పెట్టింది. ఇటీవల కెనడాలోని హిందువులు పారిపోవాలని హెచ్చరించాడు. గతంలో కూడా ఇలాగే ప్రధాని నరేంద్రమోడీ, మంత్రులు అమిత్ షా, జై శంకర్ ని హెచ్చరిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా గట్టి చర్యలు తీసుకునేందుకు సిద్ధమైసంది.
India-Canada: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, భారతదేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని వ్యాఖ్యానించారు. కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. అయితే ఇందుకు స్ట్రాంగ్ గానే భారత్ కూడా స్పందించింది. కెనడియన్ దౌత్యవేత్తను భారత్ ఐదురోజుల్లో దేశం వదిలిపెట్టి వెళ్లాలని