India-Canada: ఇండియా-కెనడాల మధ్య దౌత్యవివాదం తీవ్రస్థాయికి చేరింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇదే దేశాల మధ్య వివాదానికి కారణమైంది. ఇదిలా ఉంటే కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాదులు పంజాబ్ నుంచి ఉపాధి కోసం కెనడా వెళ్లే యువతను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హర్దీప్ సింగ్ నిజ్జర్, మొనీందర్ సింగ్ బుల్, భగత్ సింగ్ బ్రార్ వంటి ఖలిస్తాన్ ఉగ్రవాదులు పంజాబ్ నుంచి వచ్చే వారిని ఇండియా వ్యతిరేకతకు పావులుగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
Pakistan: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వరు ఉల్ హక్ కాకర్ గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. పాకిస్తాన్ లో మైనారిటీలు ముఖ్యంగా హిందువులు తీవ్ర వివక్ష, వేధింపులను ఎదుర్కొంటున్నారు. అక్కడ నానాటికి హిందువుల జనాభా తగ్గిపోతోంది. సింధ్ ప్రావిన్సులో హిందూ బాలికల్ని బలవంతంగా కిడ్నాప్ చేసి, వివాహం చేసుకుని ఇస్లాంలోకి మారుస్తున్నారు. ఇలాంటి చరిత్ర కలిగిన పాకిస్తాన్లో రాజకీయ నాయకులు కూడా హిందువులను తుడిచివేయాలని చూస్తున్నారు.
NASA: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆస్ట్రాయిడ్ మిషన్ సక్సెస్ అయింది. దాదాపుగా 7 ఏళ్ల తరువాత బెన్నూ అనే గ్రహశకలంపై నుంచి నమూనాలను భూమిపైకి తీసుకువచ్చింది. ఆదివారం అమెరికా ఊటా రాష్ట్రంలో ఎడారిలో నాసా క్యాప్సూల్ దిగింది. నాసా 2016లో ‘ఒరిసిస్ రెక్స్’ అనే స్పేస్ ప్రోబ్ ను అంతరిక్షంలోకి పంపింది. సుమారు 3 ఏళ్లు ప్రయాణించి బెన్నూ అనే గ్రహశకలాన్ని చేరింది.
Manipur: గత మూడు నెలలుగా మణిపూర్ లో అల్లర్లు భారతదేశ అంతర్గత భద్రతను ప్రశ్నిస్తున్నాయి. ఈ అల్లర్లకు పక్కనే ఉన్న మయన్మార్ నుంచి వచ్చే కొన్ని శక్తులు కూడా కారణమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా మణిపూర్ లోకి మయన్మార్ నుంచి కుకీ తెగకు చెందినవారు వచ్చి అక్కడి జనాభా
Bridge collapse:గుజరాత్ రాష్ట్రంలో సురేంద్రనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. వస్తాడి ప్రాంతంలో ఆదివారం పాత వంతెన కూలిపోయింది. దీంతో డంపర్, మోటార్ సైకిళ్లతో సహా పలు వాహనాలు వంతెన కింద ప్రవహిస్తున్న నదిలో పడిపోయాయి. వాహనాలతో పాటు ప్రయాణికులు నదిలో పడిపోయారు.
Ravi Kishan: బీజేపీ ఎంపీ నటుడు రవికిషన్ అన్‌పార్లమెంటరీ చట్టాన్ని పరిశీలించాలని డానిష్ అలీపై చర్య తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ కి లేఖ రాశారు. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే వివాదం కొనసాగుతోంది. మతప్రాతిపదికన బిధూరి, డానిష్ అలీపై వ్యాఖ్యానించాడు. ఈ వివాదం బీజేపీ వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది. చంద్రయాన్ -3 చర్చ సందర్భంగా రమేష్ బిధూరి అతనిపై పార్లమెంట్ లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇండియా ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించాడు. ఇదే కాకుండా కెనడాలోని భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించారు. దీనికి ప్రతిగా భారత్ కూడా కెనడియన్ దౌత్యవేత్తను 5 రోజుల్లో దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది. కెనడా ఆరోపణలు అసంబద్ధమైన, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా, కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఇండియా ధ్వజమెత్తింది.
Chandra Arya: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఇండియా, కెనడా దేశాల మధ్య వివాదాన్ని రాజేసింది. ఈ హత్య నేపథ్యంలో మరో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కెనడాలోని హిందువులను టార్గెట్ చేస్తూ, కెనడా వదిలిపెట్టి భారత్ వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరికల నేపథ్యంలో అక్కడి హిందువుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీనిపై కెనడాలో జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీలో ఎంపీగా ఉన్న చంద్ర ఆర్య తన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఖలిస్తానీ ఉగ్రమూకాల హెచ్చరికలతో హిందూ కెనడియన్లు భయపడుతున్నారని…
FBI warned US Khalistani elements: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఈ ఏడాది జూన్ నెలలో కెనడాలోని సర్రే ప్రాంతంలో కాల్చి చంపారు. ఇప్పుడు ఈ హత్య కెనడా, ఇండియా మధ్య దౌత్యపరమైన వివాదానికి కారణమైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా భారత దౌత్యవేత్తను బహిష్కరిస్తే , భారత్ కూడా దెబ్బకు దెబ్బ అన్నట్లుగా కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది.
Pakistan: పాకిస్తాన్ లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.ఆదివారం పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్సులో ప్యాసింజర్ రైలు ఆగి ఉన్న గూడ్సు రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 31 మంది గాయపడినట్లు మీడియా పేర్కొంది. అయితే మరణాల గురించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. షేక్ పురా జిల్లాలోని ఖిలా సత్తార్ షా స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.