Russia: ఉక్రెయిన్ యుద్ధం, వెస్ట్రన్ దేశాలతో తీవ్ర ఉద్రిక్తతల నడుమ రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. అణుపరీక్షలపై రష్యా చట్టపరమైన వైఖరిని మార్చే బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. గతంలో పుతిన్ తన అభిప్రాయాన్ని చెప్పిన విధంగానే ‘‘అణు పరీక్ష నిషేధ ఒప్పందం’ రద్దు చేసేందుకు రష్యా పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించింది. 1996లో ఈ ఒప్పందం అమెరికా సంతకం చేసినప్పటికీ, దాన్ని ఆమోదించలేదు. దీంతో రష్యా కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
Read Also: Israel-Hamas War: హమాస్ ఫైనాన్షియర్లపై అమెరికా ఉక్కపాదం.. ఖతార్, టర్కీ, గాజాలో పలువురిపై ఆంక్షలు..
రష్యా దిగుమ సభ డూమా, సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందాన్ని రష్యా ఆమోదించడాన్ని రద్దు చేసే బిల్లును బుధవారం ప్రవేశపెట్టింది. 415 ఓట్ల తేడాతో ఏకగ్రీవంగా బిల్లు పాస్ అయింది. ఈ ఒప్పందాన్ని పరిశీలించాల్సిందిగా అక్టోబర్ 5న అధ్యక్షుడు పుతిన్ డూమాను కోరాడు. ‘‘ మా పౌరులను పట్ల మా బాధ్యతను మేం అర్థం చేసుకున్నాం, ఈ రోజు ప్రపంచం అమెరికా నుంచి ముప్పు ఎదుర్కొంటోంది.’’ అని పార్లమెంట్ స్పీకర్ వ్యాచెస్లావ్ వోలోడిన్ అన్నారు.
అయితే, అమెరికా చేయని పక్షంలో తాము కూడా అణు పరీక్షలు చేయబోమని రష్యా చెబుతోంది. ఉక్రెయిన్ యుద్ధం, వెస్ట్రన్ దేశాల నుంచి ముప్పు ఎదురవుతుందని భావిస్తున్న రష్యా మళ్లీ అణు పరీక్షల వైపు అడుగులు వేస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ రష్యా, అమెరికాలు ఒకరితో ఒకరు పోటీగా అణు పరీక్షలు మొదలుపెడితే ఇది చైనా, భారత్, పాకిస్తాన్ వంటి దేశాలు కూడా అణు పరీక్షల పోటీని పెంచవచ్చని ఆయుధ నియంత్రణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ దేశాలన్నీ కూడా స్వయం నిషేధాన్ని పాటిస్తున్నాయి.